రియల్ మీ రెండురోజుల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ 5G ఫోన్ Realme 8s. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మద్యహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి జరుగనుంది. ఈ ఫోన్ మొదటి సేల్ నుండి ఈ ఫోన్ కొనేవారికి మంచి ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో గొప్ప ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ రియల్ మీ 5G ఫోన్ మంచి స్టైలిష్ డిజైన్ 64MP నైట్ స్కెప్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.
రియల్ మీ 8s స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ. 17,999 రూపాయల ధరతో, 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.19,999 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ ను realme.com నుండి ICICI క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ పొందవచ్చు. flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన కూడా అనేకమైన అఫర్లను అందించింది. Check Offers Here
ఇక ఈ రియల్ మీ 8s ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 89GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా RealmeUI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది మరియు యూనివర్స్ బ్లూ మరియు యూనివర్స్ పర్పల్ వంటి రెండు అందమైన `కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 64MP ప్రధాన కెమెరా మరియు జతగా 2ఎంపి B&W పోర్ట్రైట్ కెమెరా మరియు 2ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది మరియు ఇది కూడా EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది.
రియల్ మీ 8s ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 5,000 బిగ్ బ్యాటరీ మరియు రిటైల్ బాక్స్ లో ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుతుంది. ఈ ఫోన్ Hi-Res సౌండ్ సెర్టిఫికేషన్ తో వస్తుంది మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంది.