Realme 16 Pro Series 5G launching with never before new design
Realme 16 Pro Series 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ను ఇప్పటి వరకు రియల్ మీ ఫోన్స్ లో చూడని సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ ఇప్పుడు టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజింగ్ చేసిన వివరాలు మనం పంచుకుందాం.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ కొత్త సిరీస్ పేరుకు తగ్గట్టు 2016 లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది మనం అంచనా వేస్తున్న డేట్ మాత్రమే అని గమనించాలి.
రియల్ మీ ఈ ఫోన్ టీజింగ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ డిజైన్ ను చూపించింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అందిస్తున్నట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ ఫోన్ రియల్ మీ ఫోన్స్ లో ఎప్పుడూ చూడని సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప లెథర్ బ్యాక్ మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది.
ఈ అప్ కమింగ్ రియల్ మీ 16 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రపంచ రెనౌన్డ్ డిజైన్ మాస్టర్ నావ్టో ఫుకసావ డిజైన్ చేశారు. ఇది రియల్ మీ నంబర్ సిరీస్ లో ఫస్ట్ డిజైన్ మాస్టర్ ఫోన్ అవుతుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ సెగ్మెంట్ టాప్ టైర్ పెర్ఫార్మెన్స్ అందించే చి సెట్ తో లాంచ్ అవుతుందని కూడా రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ సిరీస్ సూపర్ పోర్ట్రైట్ ఫోటోలు అందించే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi Note 15: స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ రీవిల్ చేసిన షియోమీ.!
రియల్ మీ 16 ప్రో సిరీస్ నుంచి అందించే స్మార్ట్ ఫోన్ కలర్ వేరియంట్స్ కూడా కంపెనీ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ సిరీస్ నుంచి మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, కామెల్లియా పింక్ మరియు ఆర్కిడ్ పర్పల్ నాలుగు కలర్ వేరియంట్స్ లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ రియల్ మీ లేటెస్ట్ UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు మరిన్ని వివరాలతో మళ్ళి కలుద్దాం.