Realme 16 Pro First Sale: భారీ ఆఫర్స్ తో రియల్ మీ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!

Updated on 09-Jan-2026
HIGHLIGHTS

రియల్ మీ 16 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది

ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా రియల్ మీ అందించింది

ఈ ఫోన్ ముందుగా కొనుగోలు చేసే యూజర్లకు రియల్ మీ బడ్స్ T200 కూడా ఉచితంగా అందిస్తుంది

Realme 16 Pro First Sale: రియల్ మీ లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ 16 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా రియల్ మీ అందించింది. ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను ముందుగా కొనుగోలు చేసే యూజర్లకు రియల్ మీ బడ్స్ T200 కూడా ఉచితంగా అందిస్తుంది. ఈరోజు రియల్ మీ 16 ప్రో ఫోన్ ఫీచర్స్ మరియు ఫస్ట్ సేల్ ఆఫర్స్ తెలుసుకోండి.

Realme 16 Pro First Sale: ప్రైస్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

  • రియల్ మీ 16 ప్రో (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర : రూ. 31,999
  • రియల్ మీ 16 ప్రో (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 33,999
  • రియల్ మీ 16 ప్రో (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 36,999

ఈ ఫోన్ మాస్టర్ గోల్డ్, పెబల్ గ్రే మరియు ఆర్కిడ్ పర్పల్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్స్ అందించింది. పైన ముందే తెలిపిన విధంగా ఈ ఫోన్ ను ముందుగా కొనుగోలు చేసే యూజర్లకు రియల్ మీ బడ్స్ T200 ఇయర్ బడ్స్ కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని గుర్తుంచుకోండి.

Also Read: CES 2026 నుంచి Noise Master Buds 2 ను ఆవిష్కరించిన నోయిస్.!

Realme 16 Pro: ఫీచర్స్

ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ కేవలం 7.75mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్ బిగ్ AMOLED డిస్‌ప్లే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300-Max 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. రియల్ మీ 16 ప్రో ఫోన్ ను రియల్‌మీ UI 7.0 సాఫ్ట్ వేర్ మరియు Android 16 OS తో విడుదల చేసింది.

ఈ ఫోన్ లో జబర్దస్త్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 200MP Luma Color మెయిన్ కెమెరా (డ్యూయల్ యాక్సిస్ OIS & EIS), 8MP వైడ్ యాంగిల్ కలిగిన రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ సూపర్ స్టేబుల్ తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, సూపర్ జూమ్ కలిగి ఉంటుంది మరియు ఎడిట్ కోసం Ai ఎడిట్ జీనీ 2.0 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :