Realme 16 Pro 5G: పవర్ ఫుల్ 200MP కెమెరా మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Updated on 06-Jan-2026
HIGHLIGHTS

Realme 16 Pro 5G ను ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది

ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో విడుదల చేసింది

పవర్ ఫుల్ 200MP కెమెరా మరియు 7000 mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది

Realme 16 Pro 5G: రియల్ మీ చాలాకాలంగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు టీచింగ్ చేస్తున్న రియల్ మీ 16 ప్రో సిరీస్ ను ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో విడుదల చేసింది. వీటిలో రియల్ మీ 16 ప్రో, ఈ సిరీస్ బేసిక్ వేరియంట్ అవుతుంది. అయినా కూడా పవర్ ఫుల్ 200MP కెమెరా మరియు 7000 mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Realme 16 Pro 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్ మరియు మూడు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 31,999 ధరతో, (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 33,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (12 జీబీ + 256 జీబీ) ను రూ. 36,999 ధరతో ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్ మాస్టర్ గోల్డ్, పెబల్ గ్రే మరియు ఆర్కిడ్ పర్పల్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఈరోజు నుంచే ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ (Pre-book) స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ తో మంచి లాంచ్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లు అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు రియల్ మీ బడ్స్ T200 ఇయర్ బడ్స్ ఉచితంగా అందుకోవచ్చు.

Realme 16 Pro 5G: ఫీచర్స్

రియల్ మీ ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ లో భారీ ఫీచర్లు కలిగిన ఫోన్ గా అందించింది. ఈ ఫోన్ ను రియల్ మీ నెంబర్ సిరీస్ లో ఎప్పుడు చూడని సరికొత్త 7.75mm సూపర్ స్లీక్ మాస్టర్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో భారీ 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్స్ వంటి ఆకట్టుకునే స్క్రీన్ ఫీచర్స్ కలిగి ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుంది.

రియల్ మీ ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7300-Max 5G తో అందించింది. ఇది వేగవంతమైన పెర్ఫార్మెన్స్ మరియు AI కలయికతో తయారైంది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ ను మరింత వేగంగా మార్చే రియల్‌మీ UI 7.0 సాఫ్ట్ వేర్ మరియు Android 16 OS కూడా అందించింది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, రియల్ మీ 16 ప్రో స్మార్ట్ ఫోన్ డ్యూయల్ యాక్సిస్ OIS & EIS సపోర్ట్ కలిగిన 200MP Luma Color మెయిన్ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS వద్ద సూపర్ స్టేబుల్ 4K వీడియోలు మరియు సూపర్ జూమ్ ఫోటోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో మరింత ఆకట్టుకునే ఇమేజ్ ఎడిట్ కోసం Ai ఎడిట్ జీనీ 2.0 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: REDMI Note 15 5G: స్ట్రాంగ్ బిల్డ్ మరియు సూపర్ డిస్ప్లేతో రిలీజ్ అయ్యింది.!

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ అండ్ ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో 36 లిక్విడ్స్ తట్టుకునే శక్తితో ఉంటుంది. అంతేకాదు, గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ను 300% అల్ట్రా వాల్యూమ్ తో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :