Realme 16 5G top features revealed
Realme 16 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ టాప్ ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ సెల్ఫీ మిర్రర్ ఫీచర్ తో ఇండియాలో లాంచ్ అయ్యే ఫస్ట్ ఫోన్ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ సరికొత్త ఎయిర్ డిజైన్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. కంపెనీ రివీల్ చేసిన ఈ ఫోన్ టాప్ అండ్ కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మీ 16 స్మార్ట్ ఫోన్ సరికొత్త ఎయిర్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ షైనీ గ్లీమింగ్ వింగ్ టెక్స్చర్ బ్యాక్ తో వస్తుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ సరికొత్త రూపంతో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక కూడా సరికొత్త కెమెరా మోడ్యూల్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ సరికొత్త డిజైన్ తో తో లాంచ్ అవుతుంది.
కెమెరా, ఈ ఫోన్ సెల్ఫీ మిర్రర్ తో వచ్చే మొదటి ఫోన్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు జతగా సెల్ఫీ మిర్రర్ కలిగి ఉంటుంది. ఇది కేవలం మంచి కాంపాక్ట్ సైజులో కేవలం 183 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 8.1mm స్లీక్ సైజులో వస్తుంది.
అయితే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా భారీ 7000 mAh టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల పని చేసే సత్తా కలిగి ఉంటుందని కూడా రియల్ మీ తెలిపింది.
ఈ ఫోన్ ఎయిర్ బ్లాక్ మరియు ఎయిర్ వైట్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP69 రేటింగ్ తో లాంచ్ అవుతుంది. అంటే, ఈ రియల్ మీ ఫోన్ ను డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఆడియో పరంగా, 300% సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.
Also Read: ఫ్లిప్ కార్ట్ Cooling Days సేల్ నుంచి జబర్దస్త్ Air Cooler డీల్స్ ప్రకటించింది.!
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రియల్ మీ రివీల్ చేసే అవకాశం ఉంది.