Realme 15T: బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరాలతో లాంచ్ అయ్యింది.!

Updated on 02-Sep-2025
HIGHLIGHTS

Realme 15T స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ విడుదల చేసింది

ఈ రియల్ మీ కొత్త ఫోన్ 7000mAh బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరాలతో లాంచ్ అయ్యింది

రియల్ మీ 15టి స్మార్ట్ ఫోన్ ను అండర్ 20K సెగ్మెంట్ ఫోన్ గా లాంచ్ చేసింది.

Realme 15T స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే కెమెరా మరియు బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేసింది. ఈ రియల్ మీ కొత్త ఫోన్ 7000mAh బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరాలతో లాంచ్ అయ్యింది. మరి రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Realme 15T: ప్రైస్

రియల్ మీ 15టి స్మార్ట్ ఫోన్ ను అండర్ 20K సెగ్మెంట్ ఫోన్ గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ+ 128 జీబీ) వేరియంట్ రూ. 20,999 ధరతో, మిడ్ (8 జీబీ+ 256 జీబీ) వేరియంట్ రూ. 22,999 ధరతో మరియు హై ఎండ్ (12 జీబీ+ 128 జీబీ) వేరియంట్ రూ. 24,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను ఈరోజు నుంచి ప్రారంభించింది మరియు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 6వ తేదీ 12 గంటల నుంచి మొదలవుతుంది.

ఆఫర్లు:

ఈ ఫోన్ లాంచ్ తో పాటు భారీ బ్యాంక్ ఆఫర్లు అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ మూడు వేరియంట్స్ రూ. 18,999, రూ. 20,999 మరియు రూ. 22,999 ధరలో లభిస్తాయని రియల్ మీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ ను ముందుగా ప్రీ బుక్ చేసే వారికి రూ. 1,099 రూపాయల విలువైన రియల్ మీ T01 బడ్స్ ఉచితంగా అందిస్తుంది.

Also Read: BSNL Freedom Plan: రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ డేట్ పొడిగించిన ప్రభుత్వ టెలికాం.!

Realme 15T: ఫీచర్స్

రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ కేవలం 7.89 mm మందంతో చాలా స్లీక్ డిజైన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ పవర్ ఫుల్ అండ్ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 60W SUPER VOOC ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క Dimensity 6400 MAX 5జి చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో గరిష్టంగా 12 జీబీ ఫిజికల్ ర్యామ్, 14 జీబీ డైనమిక్ ర్యామ్ మరియు 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

ఈ ఫోన్ 6.57 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వివిద్ విజన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు మిందు కూడా 50MP సెల్ఫీ కెమెరా అందించింది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ అందించలేదు. కానీ ఈ ఫోన్ AI Edit Gene తో చాలా AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ IP66, IP68, మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా O Reality ఆడియో సపోర్ట్ అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :