Realme 15 Pro top 5 features and price
Realme 15 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రియల్ మీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేస్తుంది. వీటిలో ప్రో వెర్షన్ ప్రో ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఈ రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 జెనరేషన్ లేటెస్ట్ చిప్ సెట్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ టీజింగ్ చేస్తోంది. కంపెనీ ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ సైతం రివీల్ చేసింది.
రియల్ మీ ఈ ఫోన్ డిజైన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ ను కేవలం 7.69mm మందం కలిగిన స్లీక్ డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ ఈ కొత్త డిజైన్ లో చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఫ్లోవింగ్ సిల్వర్, సిల్క్ పర్పల్, వెల్వెట్ గ్రీన్ మరియు సిల్క్ పింక్ నాలుగు రంగుల్లో వస్తుంది.
రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ 4D కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ ఏకంగా 95% స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2500 Hz జీరో ల్యాగ్ టచ్ రెస్పాన్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ వివరాలు కూడా రియల్ మీ వెల్లడించింది. రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. డిడ్ మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ కోసం కూడా అనువైన కొత్త చిప్ సెట్ అని రియల్ మీ తెలిపింది.
రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉన్నా ఈ ఫోన్ లో 7000 బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను రోజంగా ఉపయోగించిన ఇంకా 50% శాతం బ్యాటరీ మిగిలే ఉంటుందని రియల్ మీ చెబుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో బిగ్ బ్యాటరీ అందించిన రియల్ మీ ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.
ప్రస్తుతానికి ఈ టాప్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించింది. అయితే, త్వరలోనే ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా వెల్లడించబోతున్నట్లు రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది.
Also Read: Infinix HOT 60 5G : చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
రియల్ మీ ఈ ఫోన్ ప్రైస్ గురించి ఎటువంటి హింట్ లేదా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే, రియల్ మీ ఈ ఫోన్ ను రూ. 25,000 నుంచి రూ. 27,000 ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని రూమర్స్ ఉన్నాయి.