Realme 15 5G Launched in india
Realme 15 5G : రియల్ మీ 15 సిరీస్ నుండి రెండు ఫోన్లు ఈరోజు విడుదల చేసింది. ఇందులో రియల్ మీ 15 5జి స్మార్ట్ ఫోన్ డ్యూయల్ 50MP 4K కెమెరాతో సర్ప్రైజ్ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే మొదలుకొని బిగ్ బ్యాటరీ వరకు అన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్లు తెలుసుకోండి.
రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 25,999 ధరతో, (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 27,999 మరియు హై ఎండ్ (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ని రూ. 30,999 ధరతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్ మరియు వెల్వెట్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. జూలై 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రీ సేల్ ను ఈరోజు నుంచి ప్రారంభించింది.
ఈ ఫోన్ పై రియల్ మీ గొప్ప బ్యాంక్ ఆఫర్లు అందించింది. రూ. 2,000 రూపాయల బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ మరియు ఫుల్ పేమెంట్ చేసే యూజర్లకు రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఆఫర్లు కాదనుకుంటే రూ. 5,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.
రియల్ మీ ఈ ఫోన్ ను 6.67 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ప్లస్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2500 Hz టచ్ రెస్పాన్స్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 6500 నిట్స్ సూపర్ బ్రైట్నెస్ సపోర్ట్ మరియు 94% స్క్రీన్ టు బాడీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300+ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 4nm టాప్ టైర్ ప్రోసెసర్ మరియు ఇది మల్టీ టాస్కింగ్ తో పాటు మంచి గేమింగ్ ని చక్కగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ఫిజికల్, 18 జీబీ అదనపు ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ వెనుక 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ లేటెస్ట్ ఫోన్ AI కెమెరా ఫీచర్స్, లేటెస్ట్ రియల్ మీ కెమెరా ఫిల్టర్స్ మరియు AI కెమెరా ఫీచర్స్ తో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: vivo T4R: ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసిన వివో.!
రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ 7000mAh బిగ్ బ్యాటరీ తో వచ్చింది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే పవర్ ఫుల్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే 7000mm² బిగ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7.69mm మందంతో చాలా స్లీక్ ఉంటుంది.