realme 14T 5G Launch today Price in India Features and Specifications
Realme 14T 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది రియల్ మీ. రీసెంట్ గా నార్జో 80 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు మరో కొత్త ఫోన్ లాంచ్ కోసం సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ సూపర్ స్క్రీన్ మరియు 6000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ 14టి 5జి స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో మైక్రో సైట్ పేజి కూడా అందించింది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
ఈ రియల్ మీ 14 టి 5జి స్మార్ట్ ఫోన్ ను 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్క్రీన్ 111% DCI-P3 మరియు TUV సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ శాటిన్ ఇన్స్పైర్డ్ లగ్జరీ డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 7.97mm మందంతో సన్నగా మరియు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది.
రియల్ మీ 14 టి 5జి స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ తో మాత్రమే కాదు ఓవర్ ఫుల్ బ్యాటరీ మరియు సెగ్మెంట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్ మీ తెలిపింది. అదేమిటంటే, 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 300% లౌడ్ మరియు క్లియర్ సౌండ్ అందించే స్పీకర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Blaupunkt లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ భారీ Prime Discount ఆఫర్ అందుకోండి.!
ఈ ఫోన్ ను టాప్ టైర్ ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ను సిల్కెన్ గ్రీన్, వయిలెంట్ గ్రేస్ మరియు శాటిన్ ఇంక్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది.