Realme 14 Pro Series with 120x zoom and triple flash zoom launching
Realme 14 Pro Series: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొత్త సంవత్సరం ప్రారంభంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క లాంచ్ డేట్ ను రియల్ మీ ఇంకా వెల్లడించలేదు కానీ జనవరి నెలలో విడుదలవుతుందని మాత్రం అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ 120X జూమ్ మరియు ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటాయని రియల్ మీ టీజింగ్ చేస్తుంది.
రియల్ మీ 14 ప్రో సిరీస్ ను 2025 జనవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో లాంచ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కొన్ని యూనిక్ ప్రత్యేకతలను కలిగి ఉంటుందని కంపెనీ టీజ్ చేస్తోంది.
ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ప్రపంచపు మొట్టమొదటి ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా ఫోన్స్ గా ఉంటాయి. ఈ ప్రత్యేకతను వెల్లడించే టీజర్ ఇమేజ్ తో కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ సిరీస్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ప్రతి కెమెరా మధ్యలో ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 120x జూమ్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది.
ఈ కొత్త ట్రిపుల్ ఫ్లాష్ లైట్ సెటప్ ద్వారా రాత్రి సమయాలు మరియు తక్కువ వెలుగు కలిగిన ప్లేస్ లలో కూడా ప్రకాశవంతమైన పోర్ట్రైట్ లు మరియు ఫోటోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది. ఇదే కాదు ఈ ఫోన్ వరల్డ్ ఫస్ట్ కోల్డ్ సెన్సిటివ్ ఫోన్ కూడా అవుతుంది. అంటే, ఈ ఫోన్ ను తక్కువ టెంపరేచర్ ను చేరుకున్నప్పుడు ఫోన్ కలర్ మారుతుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్: 23 వేలకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
రియల్ మీ ఈ ఫోన్ యొక్క డేట్ అనౌన్స్ చేయకుండానే ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో ఇంకా ఎన్ని ఫీచర్స్ బయటపెడుతుందో చూడాలి.