క్వాల్కామ్ 5G టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో చురుకుగా పాల్గొంది. 5G కేవలం 'ఐదవ తరానికి' నిలుస్తుంది, ఇదే ప్రపంచపు తొలి 5జీ ఫోన్ అంటూ క్వాల్‌కామ్ ఒక ఇమేజ్‌ని పోస్ట్ చేసింది.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది .
ట్విట్టర్ యూజర్ షరీఫ్ హన్నా మైక్రో బ్లాగింగు ప్లాట్ఫారం పై ప్రపంచంలోని మొట్టమొదటి 5G స్మార్ట్ఫోన్ ఫోటో ట్వీట్ చేసారు . హన్నా Qualcomm కోసం LTE మరియు 5G NR మోడెమ్ ల కోసం మార్కెటింగ్ లీడ్. అతని ట్వీట్ స్పష్టంగా తెలుపుతున్నదేమిటంటే – "నా చేతిలో ప్రపంచంలోని మొట్టమొదటి 5G స్మార్ట్ఫోన్ ఉన్నట్లు విశ్వసించటం కష్టం!"
ఈ ఇమేజ్ లోని ఫోన్ క్వాల్కమ్ యొక్క మొదటి mmWave 5G రిఫరెన్స్ డిజైన్ మరియు ఫైనల్ యూనిట్ కాదు. ఇది ఒక మొబైల్ ఫారమ్ ఫ్యాక్టర్ యొక్క పరిమితుల్లో తమ 5G mmWave పెర్ఫార్మన్స్ పరీక్షించడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి కంపెనీ ద్వారా రూపొందించబడింది.
5G స్మార్ట్ఫోన్ వెనుకవైపు స్పోర్టింగ్ డ్యూయల్ రేర్ కెమెరాలు మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ లోగోను చూడవచ్చు. హన్నా ట్వీట్ లో తెలుస్తున్నదేమిటంటే , డివైస్ మల్టీ -మోడ్ 2G / 3G / 4G / 5G కి సపోర్ట్ గా రూపొందించబడింది అని పేర్కొన్నాడు.