ఇప్పటివరకూ బడ్జెట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన రియల్మీ సంస్థ ఇక నుండి ప్రీమియం ఫోన్లను కూడా అందించనుందేమో? అనే అనుమానం అందరికి కలుగుతోంది. ఎందుకంటే, ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ అయినటువంటి, పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో ఒక కొత్త స్మార్ట్ ఫోన్నుమార్కెట్లోకి తీసుకురావడానికి తొందరపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆన్లైన్లో TENAA లిస్టింగ్ తెలిపిన ప్రకారంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద స్క్రీనుతో రానుంది మరియు ఇది బెజెల్ లెస్ గా రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లిస్టింగులో అందించిన 'RMX1901' అనే మోడల్ నంబరుతో చూపించిన ఒక స్మార్ట్ ఫోన్ను, రియల్మీ X గా సంభోదిస్తూ, దీని గురించి వివరిస్తోంది. ఈ లిస్టింగులో చింపిన వివరాల ప్రకారంగా ఈ రానున్న RMX1901 ఒక 6.5 అంగుళాల FHD+ డిస్ప్లే మరియు ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ తో రానుంది. అలాగే ఒక 3,680 బైటరీని కూడా ఇందులో అందించినట్లు కూడా తెలుస్తోంది.
అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను ముందుగా చైనాలో లాంచ్ చేయనున్నట్లు, ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న లీక్స్ మరియు రూమర్ల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే, ఇటీవల ఇండియాలో విడుదల చేయబడి మంచి అమ్మకాలను సాధిస్తున్న, రియల్మీ 3 ప్రోని త్వరలోనే చైనాలో కూడా విడుదల చేస్తుందనే, రూమర్ల ని పరిగణలోకి తీసుకుంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను చైనాలో విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, వాస్తవానికి రియల్మీసంస్థ ఇప్పటివరకు ఈ విష్యం పైన అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.