POCO X8 Pro: మిడ్ రేంజ్ బీస్ట్ గా మార్కెట్ లో అడుగుపెట్టింది.!

HIGHLIGHTS

పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఈరోజు విడుదల చేసింది

POCO X8 Pro స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా మార్కెట్ లో ప్రవేశపెట్టింది

అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్ తో లాంచ్ అయ్యింది

POCO X8 Pro: పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఈరోజు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి పోకో X8 ప్రో స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్, లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్ తో లాంచ్ అయ్యింది. ఇన్ని ఫీచర్స్ తో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు పూర్తి వివరాలు తెలుసుకుందామా.

POCO X8 Pro: ధర

పోకో ఎక్స్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ. 32,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ హై ఎండ్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ను కూడా రూ. 35,999 రూపాయల మిడ్ రేంజ్ ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు వైట్ తో మొత్తం మూడు కలర్స్ లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై పోకో ఆకట్టుకునే డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై HDFC, SBI మరియు ICICI కార్డ్స్ రూ. 3,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అంతేకాదు, రూ. 7,000 విలువైన Youtube ప్రీమియం అదనపు బెనిఫిట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఫోన్ అందించిన బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది.

Also Read: Poco X8 Pro Max: జబర్దస్త్ ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో రిలీజ్ అయ్యింది.!

POCO X8 Pro: ఫీచర్స్

పోకో X8 ప్రో స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ను ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ 120FPS వద్ద గేమింగ్ ఆఫర్ చేస్తుంది. ఇది మీడియాటెక్ Dimensity 8500 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఇండియాలో ఈ చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఇందులో 12 జీబీ LPPDR5 ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

X8 ప్రో స్మార్ట్ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాని డైనమిక్ RGB లైట్స్ తో కలిగి ఉంటుంది మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో షూట్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6500 mAh బిగ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జ్, 27W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :