అతి తక్కువ ధరలో స్నాప్ డ్రాగన్ 860 చిప్ సెట్ తో POCO X3 PRO లాంచ్

Updated on 30-Mar-2021
HIGHLIGHTS

POCO X3 PRO ఈరోజు ఇండియాలో విడుదల

చాలా కాలంగా పోకో టీజ్ చేస్తున్న Pro స్మార్ట్ ఫోన్ POCO X3 PRO ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 SoC మరియు UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ వంటి చాలా హై ఎండ్ ఫీచర్ లతో వచ్చింది. ముఖ్యంగా, ఇన్ని హై ఎండ్ ఫీచర్లు వున్నా కూడా రేటును మాత్రం కేవలం మిడ్ రేంజ్ ధరలోనే ఉంచింది.

Poco X3 Pro: ధర

1. పోకో X3 ప్రో (6GB + 128GB) ధర : Rs.17,999

2. పోకో X3 ప్రో (8GB + 128GB) ధర : Rs.19,999     

పోకో X3 ప్రో యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 6వ తేది మధ్యాహ్నం 12 గంటలకి జరుగుతుంది. అలాగే, Flipkart నుండి సేల్ అవనున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది.

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 ని అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ ఫీచర్ ని కూడా అందించింది.    

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :