POCO M8 First Sale: ఫస్ట్ డే సేల్ భారీ ఆఫర్స్ తో పోకో కొత్త ఫోన్ ను చవక ధరలో అందుకోండి.!

Updated on 12-Jan-2026
HIGHLIGHTS

పోకో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన POCO M8 First Sale రేపు జరగనున్నది

క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ఒకరోజు ముందు ఈ ఫోన్ కంప్లీట్ వివరాలు మీకు అందిస్తున్నాము

POCO M8 First Sale: పోకో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ పోకో ఎం8 5జి ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది. కర్వుడ్ డిస్ప్లే, సరికొత్త డిజైన్ మరియు క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అందుకే, ఈ ఫోన్ సేల్ ఫస్ట్ సేల్ కంటే ఒకరోజు ముందు ఈ ఫోన్ కంప్లీట్ వివరాలు మీకు అందిస్తున్నాము.

POCO M8 First Sale: ఆఫర్లు

పోకో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం.

పోకో ఎం8 (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 18,999
పోకో ఎం8 (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 19,999
పోకో ఎం8 (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 21,999

ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, గ్లేషియల్ బ్లూ మరియు ఫ్రాస్ట్ సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం అనగా 2026 జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది మరియు రాత్రి 12 గంటలకు ముగుస్తుంది.

ఆఫర్లు :

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ కంపెనీ అనౌన్స్ చేసింది. రూ. 2,000 రూపాయల ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు బోనస్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు ఈ ఫోన్ పై అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి కేవలం రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: 11 వేల బడ్జెట్ ధరలో బిగ్ QLED Smart TV కోసం చేసే వారికి బెస్ట్ డీల్.!

POCO M8 : ఫీచర్స్

ఈ ఫోన్ ను కేవలం 7.35mm స్లీక్ అండ్ 178 గ్రాముల లైట్ వెయిట్ లో అందించింది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ 3D కర్వుడ్ డిస్ప్లే ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ తో ఉంటుంది. పోకో ఈ ఫోన్ ను క్వాల్కమ్ కొత్త ప్రోసెసర్ Snapdragon 6 Gen 3 తో అందించింది. ప్రోసెసర్ కి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.

ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ను 50MP ప్రధాన సెన్సార్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 30FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ SGS MIL STD 810 సర్టిఫికేషన్ తో యాంటీ డ్రాప్ స్క్రాచ్ ప్రొటెక్షన్ ఫీచర్ తో వస్తుంది.

పోకో ఎం8 స్మార్ట్ ఫోన్ లో 5520 mAh బిగ్ బ్యాటరీ వుంది. అలాగే, ఈ ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 18W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో వచ్చింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :