POCO M8 5G: ఈ టాప్ 5 ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 02-Jan-2026
HIGHLIGHTS

POCO M8 5G లాంచ్ డేట్ తో పాటు ప్రత్యేకమైన ఫీచర్లను కూడా విడుదల చేసింది

ఈ ఫీచర్స్ లో ఈ ఫోన్ యొక్క టాప్ 5 ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి

ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇచ్చే స్మార్ట్ ఫోన్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది

POCO M8 5G : పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో పాటు ప్రత్యేకమైన ఫీచర్లను కూడా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఫీచర్స్ లో ఈ ఫోన్ యొక్క టాప్ 5 ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి. పోకో విడుదల చేసిన ఈ టాప్ 5 ఫీచర్స్ చూస్తుంటే ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇచ్చే స్మార్ట్ ఫోన్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఫోన్ కలిగిన ఆ టాప్ 5 ఆకర్షణీయమైన ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం పదండి.

POCO M8 5G : లాంచ్ డేట్?

ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ తెలుసుకునే ముందుగా ఈ ఫోన్ లాంచ్ డేట్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ జనవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త తరం ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

POCO M8 5G టాప్ 5 ఫీచర్స్

డిజైన్

పోకో ఎం సిరీస్ లో ఇప్పటివరకు చూడని సరికొత్త కర్వ్డ్ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను అందిస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.35mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. అంతేకాదు, కేవలం 178 గ్రాముల బరువుతో చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 5 అడుగుల ఎత్తు నుంచి కింద పడినా కూడా చెక్కు చెదరని యాంటీ డ్రాప్ స్క్రాచ్ ప్రొడక్షన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది SGS MIL STD 810 సర్టిఫికేషన్ తో మిలటరీ గ్రేడ్ గట్టిదనంతో ఉంటుంది.

డిస్ప్లే

పోకో ఎం8 స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ 3D కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 100% DCI-P3 వైడ్ కలర్ గాముట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఈ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అదే, Snapdragon 6 Gen 3 చిప్ సెట్ మరియు ఇది 8 లక్షల 25K వేల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగి ఉంటుందని పోకో తెలిపింది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటాయి.

ఆపరేటింగ్ సిస్టం

ఈ ఫోన్ హైపర్ OS 2.0 తో వస్తుంది మరియు త్వరలోనే హైపర్ OS 3.0 అప్డేట్ అందుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Also Read: Oppo Reno 15 Series ఇండియా లాంచ్ డేట్ వచేసిందోచ్.!

IP రేటింగ్

ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

ప్రస్తుతానికి కంపెనీ ఈ ఫోన్ యొక్క ఈ టాప్ 5 ఫీచర్స్ వెల్లడించింది. ఈ ఫోన్ మరో వారం రోజుల్లో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :