Poco M8 5G india launch date confirmed and know expected features also
Poco M8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కొత్త సంవత్సరం లో సరికొత్తగా లాంచ్ అవుతుంది. పోకో M సిరీస్ నుంచి ఎన్నడూ చూడని కొత్త డిజైన్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు పోకో చెబుతోంది. అందుకే, ఈ ఫోన్ డిజైన్ ను హైలెట్ చేస్తూ “ Designed To Slay” క్యాప్షన్ తో ఈ ఫోన్ ను టీజింగ్ చేస్తోంది.
పోకో M8 5జి స్మార్ట్ ఫోన్ 2026 జనవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుందని, పోకో ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ వివరాలు రివీల్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ తెలియజేసే టీజర్ ఇమేజ్ కూడా రివీల్ చేసింది.
ముందుగా కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతున్న డిజైన్ విషయాలు చూద్దాం. ఈ ఫోన్ చూడటానికి సన్నగా మరియు కర్వుడ్ ఎడ్జెస్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో మనం చూడవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక కెవ్లార్ ఎడ్జెస్ డిజైన్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే డిజైన్ మాత్రమే కావచ్చు అని అనిపిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ లో ఉన్న కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.35mm స్లీక్ డిజైన్ మరియు 178 గ్రాముల లైట్ వెయిట్ తో ఉంటుంది. ఓవరాల్ గా ఇది స్లీక్ అండ్ కర్వుడ్ డిజైన్ ఫోన్ అవుతుంది.
కెమెరా, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP AI డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ పోకో M సిరీస్ లో అతి సన్నని ఫోన్ అవుతుంది మరియు పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది అని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ లో వచ్చిన ఈ ఫోన్ లీక్స్ కూడా ఇదే మాట నిజం చేసేలా ఉన్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్.
Also Read: Vijay Sales యాపిల్ డేస్ సేల్ నుంచి iPhone 17 Pro పై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది.!
ఇక ఈ ఫోన్ పై ఆన్లైన్ లో లీకైన అంచనా ఫీచర్స్ చూస్తే, ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Snapdragon 6 Gen 3 తో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.