Poco M8 5G ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్.. అంచనా ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

Updated on 27-Dec-2025
HIGHLIGHTS

Poco M8 5G ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది

బడ్జెట్ ఫోన్ సిరీస్ గా మంచి ప్రాచుర్యం పొందిన పోకో M సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్

ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ ఫోన్ డిజైన్ వెల్లడించే ఇమేజ్ అందించింది

Poco M8 5G ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా ఇండియాలో మంచి ప్రాచుర్యం పొందిన పోకో M సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఎం8 ఫోన్ ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకే, ఈ ఫోన్ లాంచ్ చేయడానికి లేదా ఫీచర్స్ వెల్లడించడానికి ముందుగానే ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాము.

Poco M8 5G : లాంచ్ డేట్?

ప్రొకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కొత్త సంవత్సరం, అంటే 2026 జనవరి నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాము. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీలు కూడా కొత్త ఫోన్ లాంచ్ కోసం కౌంట్ డౌన్ మొదలుపెట్టాయి. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కూడా కొత్త సంవత్సరంలో ఉంటుందని అంచనా వేశాము. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుండి ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ అందించింది.

Poco M8 5G : అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ ఫోన్ డిజైన్ వెల్లడించే పోస్టర్ ఇమేజ్ అందించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ వెనుక కర్వుడ్ గ్లాస్ డిజైన్ మరియు పైన సెంటర్ లో పెద్ద స్క్వేర్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది పోకో ఎం సిరీస్ ఫోన్స్ లో ఎప్పుడు లేని మరియు చూడని కొత్త డిజైన్ తో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కోసం అందించిన “Design To Play” క్యాప్షన్ కూడా ఇందుకు అడ్డం పట్టేలా ఉంటుంది.

ఇక ఈ ఫోన్ లోపల కలిగి వుండే అంతర్గత భాగాలు కూడా నేటి మార్కెట్ ట్రెండ్స్ కి తగిన విధంగా ఉంటాయని ఊహిస్తున్నారు. కంటెంట్ మరియు గేమింగ్ కోసం అనువైన 6.8 ఇంచ్ బిగ్స్క్రీన్ తో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ సిరీస్ ఫోన్ అయినా కూడా ఈసారి క్వాల్కమ్ కొత్త ప్రోసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని ఆన్లైన్ లో రూమర్స్ నడుస్తున్నాయి. ఈ ఆన్లైన్ రూమర్స్ ప్రకారం, ఈ ఫోన్ Snapdragon 6 Gen 3 తో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Xiaomi 17 Ultra: 200MP లైకా పెరిస్కోప్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మనం చర్చిస్తున్న అన్ని ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో వచ్చిన రూమర్స్ మరియు లీక్స్ మాత్రమే సుమ. కంపెనీ ఈ ఫోన్ అఫీషియల్ లాంచ్ డేట్ అనౌన్ చేసిన తర్వాత ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. అప్పటి వరకు ఈ అంచనా ఫీచర్స్ ఈ ఫోన్ గురించి ఒక అంచనా మాత్రమే అందిస్తాయి. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :