Poco M7 Plus 5G ఫోన్ బిగ్ సినిమాటిక్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!

Updated on 08-Aug-2025
HIGHLIGHTS

నిన్న Poco M7 Plus 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అప్డేట్ విడుదల చేసిన పోకో

ఈ రోజు ఈ ఫోన్ డిస్ప్లే ని వివరించే డీటెయిల్స్ రివీల్ చేసింది

ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ సినిమాటిక్ డిస్ప్లేతో లాంచ్ అవుతుంది

నిన్న Poco M7 Plus 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అప్డేట్ విడుదల చేసిన పోకో ఈరోజు ఈ ఫోన్ డిస్ప్లే గురించి టీజింగ్ వివరాలు అందించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు బ్యాటరీ మరియు ఫస్ట్ లుక్ కూడా నిన్న రివీల్ చేసింది. అయితే, ఈ రోజు ఈ ఫోన్ డిస్ప్లే ని వివరించే డీటెయిల్స్ రివీల్ చేసింది. ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ సినిమాటిక్ డిస్ప్లేతో లాంచ్ అవుతుందని పోకో కొత్త అప్డేట్ విడుదల చేసింది.

Poco M7 Plus 5G : లాంచ్ అండ్ టీజర్ స్పెక్స్

పోకో ఎం 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ పోకో నిన్న రివీల్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ ని ‘పవర్’ పేరుతో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీ కారణంగా ఈ పేరు దానికి పెట్టినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈరోజు ఈ ఫోన్ గురించి రివీల్ చేసిన కొత్త అప్డేట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ సినిమాటిక్ డిస్ప్లే తో వస్తుందని పోకో తెలిపింది. అంతేకాదు, ఇది సూపర్ స్మూత్ కంటెంట్ మరియు గేమింగ్ కోసం 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన ఈ బిగ్ డిస్ప్లే కళ్ళకు హాని కలిగించని TUV రెస్లాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ డిజైన్ మరియు బ్యాటరీ వివరాలు పోకో ముందే అందించింది. ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోన్ స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ లాంచ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో సరికొత్త బ్యాక్ ప్యానల్ డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read: భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో విడుదలైన Infinix GT 30 5G స్మార్ట్ ఫోన్.!

Poco M7 Plus 5G: ప్రైస్

పోకో ఎం 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ. 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెడుతుంది. ఇదే విషయాన్ని పోకో ఈ ఫోన్ టీజర్ లో భాగంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ ఇదే అవుతుందని కూడా పోకో చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :