POCO M4 Pro 5G: 50MP కెమెరా మరియు DCI-P3 సపోర్ట్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది

HIGHLIGHTS

POCO M4 Pro 5G విడుదల చెయ్యబడింది

ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది

ఈ కొత్త ఫోన్ ను పోకో ఎం3 ప్రో అప్గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది

పోకో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ POCO M4 Pro 5G ను ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ ను పోకో ఎం3 ప్రో అప్గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది.  అంతేకాదు, ఈ ఫోన్ POCO M4 సిరీస్ లో మొదటి ఫోన్ కూడా అవుతుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ మరియు మరిన్ని బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యబడింది.

POCO M4 Pro 5G: ధర

POCO M4 Pro 5G రెండు వేరియంట్ లలో వస్తుంది. వీటిలో బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 229 (సుమారు రూ. 19,600) ధరతో వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 249 (సుమారు రూ. 21,400) ధరతో వచ్చింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు పోకో ఎల్లో అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

POCO M4 Pro 5G: స్పెక్స్

ఈ POCO M4 Pro 5G ఫోన్ పెద్ద 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.

పోకో ఎం4 ప్రో 5G  వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. అయితే, ఇది ఎక్కువ కెమెరాలతో ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.  ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :