POCO M2 PRO త్వరలోనే లాంచ్ కానుంది : ముఖ్యమైన స్పెక్స్ కూడా ఆన్లైన్లో లీకయ్యాయి

HIGHLIGHTS

ఈ బ్రాండ్ భారత మార్కెట్ కోసం వేరే ఫోన్ను సిద్ధం చేస్తోంది

వై-ఫై అలయన్స్ డేటాబేస్ లో కూడా కనిపించింది.

POCO M2 PRO త్వరలోనే లాంచ్ కానుంది : ముఖ్యమైన స్పెక్స్ కూడా ఆన్లైన్లో లీకయ్యాయి

పోకో త్వరలో తన కొత్త స్మార్ట్ ‌ఫోన్ను భారతదేశంలో విడుదల చేయనుంది. పోకో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పోకో ఎఫ్ 2 ప్రో ను విడుదల చేసింది, అయితే ఈ బ్రాండ్ భారత మార్కెట్ కోసం వేరే ఫోన్ను సిద్ధం చేస్తోంది. ఈ ఫోన్నుకు POCO M 2 PRO అనే పేరుని ఖరారు చేసినట్లు కూడా చెబుతోంది మరియు ఈ ఫోన్ బ్లూటూత్ సిగ్ మరియు వై-ఫై అలయన్స్ డేటాబేస్ లో కూడా కనిపించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

పోకో M2 ప్రో గురించి ఆన్లైన్లో లీకైన సమాచారం

GSMArena ప్రకారం, SI లిస్టింగ్ MIUI 11 మరియు బ్లూటూత్ 5.0 తో ఈ పోకో M2 ప్రో కు మద్దతు ఇస్తుందని వెల్లడించింది. రెడ్మి నోట్ 9 ఫోన్ ‌కు సమానమైన ఫోన్ డిక్లరేషన్ ఐడిని ఈ వెబ్‌సైట్ సూచించింది.

ఆండ్రాయిడ్ 10 లో ఈ ఫోన్ పనిచేస్తుందని, పోకో ఎం 2 ప్రో పేరిట వస్తుందని వై-ఫై అలయన్స్ లిస్టింగ్ చూపిస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై సపోర్ట్ పొందబోతోంది. గ్రామ్ కెర్నల్ సోర్స్, ఇది రెడ్మి నోట్ 9 ప్రో తో సమానంగా చూపిస్తుంనట్లు GSMarena పేర్కొంది. అందువల్ల పోకో ఎం 2 ప్రో రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌ గా అందించబడుతుందని ఊహిస్తున్నారు.

అధికారిక ప్రకటన కంటే ముందే, ఈ పోకో ఎం 2 ప్రో ఇంటర్నెట్‌లో చాలాసార్లు కనిపించింది. గత నెల నాటికి, ఈ ఫోన్ షావోమి ఇండియా ఆర్‌ఎఫ్ ఎక్స్‌పోజర్ పేజీలో కనిపించింది.

పోకో ప్రస్తుతం తన తదుపరి ఆడియో పరికరం కోసం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఇటీవల త్వరలో రాబోయే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ పేరును కూడా సూచిస్తోంది. పోకో యొక్క వైర్‌లెస్ ఇయర్ ‌బడ్స్ ‌కు పోకో పాప్ బడ్స్ అని పేరు పెట్టవచ్చు మరియు భారతదేశంలో రియల్మి బడ్స్ ఎయిర్ మొదలైన వాటితో ఇది పోటీ పడనుంది.

పోకో ఎఫ్ 2 ప్రో స్పెక్స్

గత నెలలో, పోకో తన పోకో ఎఫ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ను ప్రీమియం స్పెక్స్ మరియు ఫీచర్లతో విడుదల చేసింది. పోకో ఎఫ్ 2 ప్రో లో ఒక 6.67 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ ఒక 20: 9 ఆస్పెక్టు రేషియాతో మరియు  గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణతో ఉంటుంది. అల్యూమినియం చట్రం ఫోన్ వెనుక భాగంలో ఇవ్వబడుతుంది మరియు దాని కొలత 8.9 మిమీ.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది, ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో జత చేయబడింది. ఇది 8GB LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజితో జత చేయబడింది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పోకో లాంచర్ 2.0 లో ఫోన్ పనిచేస్తుంది మరియు డార్క్ మోడ్, రివాంప్డ్ యాప్ డ్రాయర్ వంటి కొత్త ఫీచర్లను ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo