POCO F8 Ultra with bose audio and built in woofer launched globally
POCO F8 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు గ్లోబల్ మార్కెట్ పోకో లాంచ్ చేసింది. షియోమీ ఉప బ్రాండ్ అయిన పోకో ఈ ఫోన్ ను BOSE ఆడియో మరియు ఉఫర్ తో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఇది మాత్రమే కాదు ప్రీమియం టెక్స్చర్ డిజైన్ మరియు 8 Elite Gen 5 వంటి మరిన్ని బారి ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.
పోకో ఎఫ్ 8 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ ఐ-కేర్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 3500 పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, వెట్ టచ్ 2.0 సపోర్ట్, HDR10+ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 3nm మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కలిగిన Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ 16GB LPDDR5x ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ ఆఫర్ చేసింది.
ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ను 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో అందించింది. అలాగే, ముందు 32mp సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 30FPS 8K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, 60FPS వద్ద 4K వీడియో మరియు 1920FPS అల్ట్రా స్లో మోషన్ వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో పామ్ షట్టర్, వాయిస్ షట్టర్ మరియు సెల్ఫ్ టైమర్ వంటి ఫీచర్స్ కూడా అందించింది.
ఈ ఫోన్ రెండు సిమెట్రికల్ స్టీరియో స్పీకర్ మరియు ఇండిపెండెంట్ ఉఫర్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Bose ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో, హై రిజల్యూషన్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ Hyper OS 3 తో లాంచ్ అయ్యింది.
ఈ పోకో కొత్త ఫోన్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 22.5W రివర్స్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: Tariff Hike 2025: బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంచిన Vi టెలికాం.. టారిఫ్ బాదుడు షురూ.!
పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను గ్లోబల మార్కెట్లో 679 డాలర్ల (సుమారు రూ. 60,589) బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.