Poco F7 5G: లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ విడుదల చేసిన పోకో.!

Updated on 17-Jun-2025
HIGHLIGHTS

పోకో F సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్

ఈ నెల చివరి వారంలో లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది

కీలక ఫీచర్స్ సైతం పోకో ఈరోజు రివీల్ చేసింది

Poco F7 5G: పోకో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన F సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్ చేసింది. జూలై నెల మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేయగా, పోకో మాత్రం ఈ ఫోన్ ను ఈ నెల చివరి వారంలో లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ ఫోన్ వేరియంట్స్ మరియు కీలక ఫీచర్స్ సైతం పోకో ఈరోజు రివీల్ చేసింది.

Poco F7 5G : ఎప్పుడు లాంచ్ అవుతుంది?

జూన్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు డేట్ మరియు టైమ్ కూడా పోకో ఈరోజు కన్ఫర్మ్ చేసింది. పోకో అఫీషియల్ X (గతంలో ట్విట్టర్) అకౌంట్ నుంచి ఈ లాంచ్ డేట్ పోస్ట్ ను షేర్ చేసింది. అయితే, ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ అందించింది.

Poco F7 5G : కీలక ఫీచర్స్ ఏమిటి?

పోకో ఎఫ్ 7 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు ఎడిషన్ లలో అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ను చూపించింది. అంటే, ఇందులో రెగ్యులర్ పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ మరియు లిమిటెడ్ ఎడిషన్ రెండు ఫోన్లు ఉండే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పోకో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

ఇక ఈ ఫోన్ కీలక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను అతిపెద్ద 7550 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు పోకో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ అదనపు ఫీచర్లు కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ను మోడరేట్ గా ఉపయోగించే వారికి రెండు రోజులు బ్యాటరీ బ్యాకప్ ను ఈ బ్యాటరీ అందిస్తుందని పోకో తెలిపింది. ఇది మాత్రమే కాదు ఈ బ్యాటరీ ఎక్కువ కాలం నడిచే మన్నికైన బ్యాటరీ అని కూడా చెబుతోంది.

ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. కేవలం ఛార్జ్ మాత్రమే కాదు ఇందులో వేగవంతమైన రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా జత చేసింది.

Also Read: 5.1 Dolby Soundbar: రూ. 10,000 బడ్జెట్లో ఇంటిని సినిమా థియేటర్ చేసే బెస్ట్ సౌండ్ బార్స్ ఇవే.!

ఇక ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ప్రొకో ఎఫ్ 7 ఫోన్ Snapdragon చిప్ సెట్ కలిగి ఉంటుందని కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో 50MP OIS డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుత అప్డేట్స్ ఇవే, ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :