MIUI 11 అందుకోనున్న POCO F1 స్మార్ట్ ఫోన్

Updated on 25-Sep-2019
HIGHLIGHTS

MIUI 11 అందుకోనున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను కూడా ప్రకటించంది.

నిన్న చైనాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో షావోమి సంస్థ తన సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అలాగే, తన OS స్కిన్ అయినటువంటి MIUI యొక్క తరువాతి అప్డేట్ అయినటువంటి MIUI 11 అందుకోనున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను కూడా ప్రకటించంది. అయితే, అందులో ఆశ్చర్యకరంగా POCO F1 యొక్క పేరు లేకపోవడం  కొంత ఈ ఫోన్ కలిగిన వినియోగధారులను కొంత నిరుత్సహానికి మరియు ఆందోళనకు గురిచేసింది.

స్నాప్ డ్రాగన్ 845 SoC కలిగి చాలా గొప్ప స్పెక్స్ తో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోనుకు MIUI 11 అప్డేట్ ఎందుకు ప్రకటించలేదు అనే విషయం ఎవ్వరికీ అర్ధంకాని విషయంగా మిగిలిపోయింది. అయితే,  అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ, షావోమి యొక్క ఎగ్జిక్యూటివ్ దీని గురించిన అనుమానాలను తొలగించేలా సమాధానం ఒక  ట్వీట్ ద్వారా తెలిపారు. ముందుగా, ఈ విషయాన్ని GSM arena నివేదించింది.

ఈ నివేదిక ప్రకారం, సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ దీని గురించి ట్వీట్ చేస్తూ, ముందుగా ప్రకటించిన ఈ MIUI 11 అప్డేట్ అందుకోనున్న స్మార్ట్ ఫోన్ల లిస్ట్ కేవలం చైనాలో లాంచ్ చెయ్యబడిన స్మార్ట్ ఫోన్ల లిస్ట్ మాత్రమే మరియు చైనాలో పోకో లేనందున ఈ ఫోన్ యొక్క ప్రకటించలేదు. వాస్తవానికి, షావోమి పోకో F1 కూడా ఈ MIUI 10 అప్డేట్ అందుకుంటుందని, అయన ట్వీట్ చేశారు.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :