షావోమి POCO F1 ఇప్పుడు కేవలం రూ.16,999 మాత్రమే : ఈ రోజుతో ముగియనున్న అఫర్

HIGHLIGHTS

ఇప్పుడు Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందిస్తున్న Month - End Mobile Festive సేల్ నుండి POCO F1 స్మార్ట్ ఫోన్ పైన ఇలాంటి భారీ ఆఫరును అందించింది.

షావోమి POCO F1 ఇప్పుడు కేవలం రూ.16,999 మాత్రమే : ఈ రోజుతో ముగియనున్న అఫర్

Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ప్రకటించిన 'Month – End Mobile Festive' సేల్ ద్వారా ట్రెండీ మరియు తాజా మొబైల్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా, కొన్ని స్మార్ట్ ఫోన్ల యొక్క ఎక్స్చేంజి పైన ఎక్స్ట్రా డిస్కౌంట్లు వంటి ఆఫర్లతో అందిస్తుంది. ఇప్పుడు Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందిస్తున్న Month – End Mobile Festive సేల్ నుండి POCO F1 స్మార్ట్ ఫోన్ పైన ఇలాంటి భారీ ఆఫరును అందించింది. Month – End Mobile Festive సేల్  ఈ రోజుతో ముగియనుంది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, 22,999 ధరతో వచ్చినటువంటి, Mi A2 స్మార్ట్ ఫోన్ పైన అనేకసార్లు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ, ఇది 19,999 ధర వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. కానీ, కానీ ఇప్పుడు ఈ  Month – End Mobile Festive సేల్ ద్వారా ఈ ఫోన్ పైన ప్రకటించిన ఎక్స్ట్రా ఎక్స్చేంజి బోనస్ ఆఫరుతో దీని కొనుగోలు పైన 3,000 రూపాయల భారీ క్స్చేంజి బోనస్ ని ప్రకటించింది. అంటే, ఎక్స్చేంజి ఆఫరు క్రింద ఇచ్చిన 3,000 బోనస్ ని తగ్గిస్తే, ఇది కేవలం రూ.16,999 ధరకే అందుతుంది.  

Poco F1 ప్రత్యేకతలు

ఈ Poco F1 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది మరియు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఈ టెక్నాలజీ, ముఖ్యంగా ఫోన్ వినియోగ సమయంలో CPU ను చల్లబరచడానికి సహాయపడే ఒక రాగి గొట్టం కలిగివుంటుంది . ఈ స్మార్ట్ ఫోన్ 19: 9 యొక్క రిజల్యూషన్ తో ఒక 6.18-అంగుళాల ఫుల్  HD + IPS LCD డిస్ప్లే మరియు పైన ఒక 'నోచ్' కలిగిఉంది. డిస్ప్లే పైన ఉండే ఈ నోచ్,  లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్, ఒక 20MP కెమెరా మరియు లోపల ఒక సన్నిహిత సెన్సార్ కలిగివుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు స్పీడ్ ఛార్జ్ 3.0 సాంకేతికతతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, Poco F1 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ప్రాధమిక కెమెరాలో f / 1.8 ఎపర్చర్, డ్యూయల్ పిక్సెల్ PDAF టెక్నాలజీ, రియల్ టైమ్ AI ఫోటోగ్రఫి, 25 కేటగిరీలు, AI బ్యాక్లైట్ డిటెక్షన్ మరియు పోర్ట్రెయిట్ మోడ్లలో 209 సన్నివేశాలను గుర్తించే సామర్ధ్యంతో 12MP సోనీ IMX 363 సెన్సార్ను కలిగి ఉంది. ద్వితీయ కెమెరాగా 5MP సెన్సార్ను కలిగి ఉంది. ఫోన్లో రెండు స్పీకర్లు ఉన్నాయి: ఒకటి క్రింద ఉంది మరియు మరొకటి ఈయర్ పీస్ లో  ఉంది. ఇవి రెండు కూడా డిరాక్ HD సౌండ్తో డ్యూయల్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్ను కలిగివున్నాయి.

ఇంకా ఇది widevine ద్రువీకరణతో వస్తుంది. అంటే Netflix వంటి ప్లాట్ఫారల పైన HD కంటెంట్ వీడియోలను చూడవచ్చు. అదనంగా, ఇది ఒక గేమ్ టర్బో మోదుతో వస్తుంది కాబట్టి, గేమింగ్ సమయంలో ఈ ఫోన్ మీకు అత్యంత వేగంగా పనిచేసేలా చేస్తుంది. 

 

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile