రేపు విడుదల కానున్న Poco C85 5G టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

Updated on 08-Dec-2025
HIGHLIGHTS

Poco C85 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ రోజు మీ ముందుకు తీసుకొచ్చాము

ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

Poco C85 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ రోజు మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ ఫోన్ పోకో బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ అవుతుంది. కానీ ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ మరియు ఈ ఫోన్ మరిన్ని ప్రత్యేకతలు ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఒకరోజు ముందుగానే తెలుసుకోండి.

Poco C85 5G : టాప్ ఫీచర్స్

డిజైన్

పోకో సి 85 స్మార్ట్ ఫోన్ స్లీక్ బాడీ మరియు డ్యూయల్ టోన్ కలర్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది.

డిస్ప్లే

ఈ పోకో అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 810 హై బ్రైట్నెస్ మోడ్ (HBM) సపోర్ట్ కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

పోకో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందిస్తుంది. ఇందులో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు గొప్ప స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ 5జి చిప్ సెట్ మరియు ఈ చిప్ సెట్ తో మంచి మల్టీ టాస్కింగ్ అఫర్ చేస్తుంది.

కెమెరా

ఈ ఫోన్ 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా కలిగే ఉంటుంది. ఇందులో 1x మోడ్ మరియు 2x మోడ్ తో పాటు లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

Also Read: Samsung Galaxy S24 FE 5G: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి జబర్దస్త్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

బ్యాటరీ అండ్ ఛార్జ్

ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మిస్టిక్ పర్పల్, స్ప్రింగ్ గ్రీన్ మరియు పవర్ బ్లాక్ మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఇది పోకో బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ అవుతున్న ఫోన్ కాబట్టి, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ మరియి సేల్ వివరాలతో రేపు కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :