Poco C85 5G బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే తో లాంచ్ కి సిద్ధం.!

Updated on 05-Dec-2025
HIGHLIGHTS

Poco C85 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం సిద్ధం అయ్యింది

భారీ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్లు విడుదల చేసింది

Poco C85 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం సిద్ధం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ చూడముచ్చటైన డిజైన్ మరియు మూడు సరికొత్త రంగుల్లో కూడా లాంచ్ అవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.

Poco C85 5G : లాంచ్ డేట్

పోకో సి85 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ ని నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్లు విడుదల చేసింది.

Poco C85 5G : కీలక ఫీచర్స్

పోకో సి85 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్ కలిగిన కలిగిన కర్వుడ్ బ్లాక్ తో వస్తుంది మరియు కేవలం 7.99mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 6.9 ఇంచ్ HD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. పోకో సి85 ఫోన్ లో కళ్లకు హాని కలిగించని లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ చాలా వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ మిస్టిక్ పర్పల్, స్ప్రింగ్ గ్రీన్ మరియు పవర్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ తో లాంచ్ అవుతుంది.

Also Read: BSNL Super Plans: చవక ధరలో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ వాటర్ డ్రాప్ మోడల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అయితే, ఇది పోకో బడ్జెట్ సిరీస్ గా ప్రసిద్ధి చేసిందిన సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి ఈ ఫోన్ ఫీచర్స్ సమంజసంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే C సిరీస్ నుంచి చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందించిన పోకో, ఇప్పుడు ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :