Poco C71 launched with premium design and big battery
Poco C71: పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. పోకో సి 71 స్మార్ట్ ఫోన్ 6 వేల సెగ్మెంట్ లో ప్రీమియం డిజైన్ మరియు పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ ను కలిగి ఉండటమే కాకుండా ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుందని పోకో చెబుతోంది. పోకో సరికొత్తగా విడుదల చేసింది ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూ. 6,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క రెండవ (6GB + 128GB) వేరియంట్ రూ. 7,499 ధరతో లాంచ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
పోకో సి 71 స్మార్ట్ ఫోన్ 6.88 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HD+ (1640 x 720) రిజల్యూషన్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం స్ప్లిట్ గ్రిడ్ డిజైన్ తో వస్తుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది. సి 71 స్మార్ట్ ఫోన్ Unisoc T7250 చిప్ సెట్ జత 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది.
పోకో సి 71 ఫోన్ వెనుక 32MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 30fps తో 1080p వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో నైట్ మోడ్, టైమ్ లాప్స్ మరియు అల్ట్రా HD మోడ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ ఉంటాయి.
Also Read: Flipkart Sale: 50 ఇంచ్ టీవీ ధరకే లేటెస్ట్ 65 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
పోకో సి 71 ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ IP52 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ మరియు డెజర్ట్ గోల్డ్ మూడు రంగుల్లో లభిస్తుంది.