Poco C31 బడ్జెట్ ధరలో విడుదల…ధర ఎంతంటే..!

Updated on 01-Oct-2021
HIGHLIGHTS

లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Poco C31

5,000 mAh బిగ్ బ్యాటరీ

13ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

పోకో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Poco C31 ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart The Big Billion Days Sale సందర్భంగా విడుదల చేసింది మరియు ఈ ఫోన్  అక్టోబర్ 2వ తేదీ 12 Am నుండి అమ్మకాలను కొనసాగిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ నుండి అఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది.

Poco C31: ధర

Poco C31 (3GB + 32GB) ధర – Rs.7,999

Poco C31 (4GB + 64GB) ధర – Rs.8,999

Poco C31: స్పెసిఫికేషన్స్

షియోమి పోకో సి 31 లో ఒక 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.  ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. C 31 కేవలం 9 మిల్లీమీటర్ల మందం మరియు 164 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్లూ మరియు షాడో గ్రే రెండు రంగుల్లో లభిస్తుంది. 

పోకో సి 31 మీడియా టెక్ Helio G35 ఆక్టా-కోర్ సిపియు మరియు పవర్‌విఆర్ జిఇ 8320 గ్రాఫిక్‌లతో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 512 జిబి వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది డార్క్ మోడ్ వంటి ఫీచర్లతో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన సరికొత్త MIUI 12 పై నడుస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 13MP కెమెరా, 2MP మాక్రో కెమెరా మరియు 2MP  పోర్ట్రైట్ కెమెరా  ఉన్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌లో ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది.

పోకో సి 31 స్మార్ట్ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది మరియు రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లకు మద్దతునిస్తుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :