ఇండియాలో OPPO రెనో సిరీస్ ఫోన్లు విడుదల : 10X హై బ్రిడ్ జూమ్ దీని సొంతం

Updated on 28-May-2019
HIGHLIGHTS

ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లయినటువంటి, Oppo Reno మరియు Oppo Reno 10x జూమ్ లను విడుదల చేసింది.

Oppo ఈ రోజు భారతదేశంలో తన Oppo Reno సిరీస్ ప్రకటించింది. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లయినటువంటి, Oppo Reno మరియు Oppo Reno 10x జూమ్ లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు, ఇప్పటికే చైనాలో ప్రారంభించబడ్డాయి, కానీ ఇప్పుడు కూడా వీటి యొక్క ధర మరియు లభ్యత గురించిన వివరాలను తేటతెల్లం చేసింది.

ఒప్పో రెనో 10X జూమ్ ఎడిషన్ : ప్రత్యేకతలు

OPPO రెనో 10X జూమ్ HDR 10+ కంటెంట్ మద్దతు మరియు 93.1 శాతం బాడీ టూ స్క్రీన్ రేషియాతో కాస్తుంది. ఇందులో ఒక పెద్ద 6.6 అంగుళాల AMOLED డిస్ప్లేని అందించారు. ఈ ఫోన్ ముందు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో భద్రపరచబడింది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్  శక్తితో 6GB / 128GB మరియు 8GB / 256GB వేరియంట్స్ మరియు ఓషియన్ గ్రీన్ మరియు జెట్ బ్లాక్ వాటి రంగుఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక F / 1.7 ఎపర్చరు గల ఒక 48 మెగాపిక్సెల్స్ ప్రధాన సెన్సార్ ఉంది, ఇది ఒక సోనీ IMX586 సెన్సారుతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో ఉంది మరియు మొరొక 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు మూడవ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లను కలిగిఉంది. ఈ కెమెరా సంస్థ యొక్క 10X హైబ్రిడ్ జూమ్ టెక్నాలజీతో లోడ్ చేయబడింది మరియు ఇది OIS, అల్ట్రా నైట్ మోడ్ 2.0 వంటి లక్షణాలు కలిగి ఉంది. ఈ ఫోన్  ముందు ఒక 16MP సెల్ఫీ కెమేరాని ఒక సరి కొత్త రూపంతో అందించింది.

ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 4065mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హైపర్ బూస్ట్ 2.0 ను కలిగి ఉంది, ఇది గేమ్స్, ఆప్స్  మరియు పెరఫార్మెన్స్ ని ప్రోత్సహిస్తుంది. ఇందులో, OS గురించి చూస్తే,ఇది కలర్ OS 6.0 తో పనిచేస్తుంది.

Oppo Reno : ప్రత్యేకతలు

ఇది ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియో కలిగి మరియు ఎలాంటి నోచ్ లేకుండా పూర్తి HD + రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల AMOLED డిస్ప్లేని అందించింది. ఇది ప్రామాణిక ఎడిషన్ కాబట్టి ఒకస్నాప్ డ్రాగన్ 710 SoC  శక్తితో నడుస్తుంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజితో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోనులో కూడా ఒక 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి.  అలాగే, ఈ 48MP కెమెరా సోనీ IMX586 సెన్సార్ను ఉపయోగిస్తుంది. అధనంగా, ఇందులో కూడా 16-మెగాపిక్సెల్ షార్క్-ఫిన్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ పరికరం 3765mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఇంకా ఇది హైపర్ బూస్ట్ 2.0 ను కలిగి ఉంది, ఇది గేమ్స్, ఆప్స్  మరియు పెరఫార్మెన్స్ ని ప్రోత్సహిస్తుంది. ఇందులో, OS గురించి చూస్తే,ఇది కలర్ OS 6.0 తో పనిచేస్తుంది.

Oppo రెనో మరియు Oppo రెనో 10x జూమ్ : ధరలు

Oppo రెనో 10x జూమ్ 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ రూ 39,990 వద్ద కొనుగోలు చేయవచ్చు మరియు  8GB RAM మరియు 256GB స్టోరేజి వేరియంట్ రూ 49,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇక ఒప్పో రెనో ధరను రూ. 32,990గా నిర్ణయించారు.ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటిసేల్ జూన్ 7 వ తేదీ Flipkart నుండి ప్రారంభమౌతుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :