OPPO Reno Z బెస్ట్ ట్రెండీ ఫీచర్లతో అతితక్కువ ధరతో విడుదల

Updated on 27-May-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను ఒక మధ్యస్థాయి ఫోనుగా తీసుకొచ్చింది.

Oppo యూరోపియన్ మార్కెట్లో తన తాజా స్మార్ట్ ఫోన్ అయినటువంటి, Oppo Reno Z ను ప్రారంభించింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక మధ్యస్థాయి ఫోనుగా తీసుకొచ్చింది.  ఇది ఒక వాటర్ డ్రాప్ డిజైన్ కలిగి, స్నాప్ డ్రాగన్ 710 SoC మరియు డ్యూయల్ కెమేరా సేప్పుతో తీసుకొచ్చింది. OPPO తన రెనో సిరీస్ నుండి గొప్ప ఫోన్లను తీసుకొస్తోంది. OPPO రెనో 10x జూమ్ ఎడిషన్ మరియు రెనో 5G వేరియంట్ అలాగే ఇప్పుడు రెనో Z వంటి వాటిని చాల త్వరగా తీసుకొచ్చింది. 

OPPO రెనో Z ధర మరియు లభ్యత

OPPO రెనో Z మధ్యస్థాయి ధరలో € 150 యూరోలతో విడుదల చేసింది ఇది మనకు ఇంచుమించు 11,700 రూపాయలకు సమానంగా ఉంటుంది. ఈ ఫోన్ జూన్ 2019 లో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఓషన్ గ్రీన్  మరియు జెట్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

OPPO రెనో Z యొక్క ప్రత్యేకతలు

ఈ ఫోన్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అందించగల ఒక 6.4 అంగుళాల FHD + డిస్ప్లే తో ఉంటుంది. ఈ డిస్ప్లే ఎగువన వాటర్ డ్రాప్ నోచ్  అందించబడుతుంది. ఇది అత్యంత సన్నని బెజెల్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ ఒక 3950mAh బ్యాటరీని, 20W VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికతతో కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా ఒక 6GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజిని కలిగి ఉంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకోవడానికి వీలుగా మైక్రో SD కార్డ్ ఇవ్వలేదు కాబట్టి, మెమొరీ పెంచుకునే అవకాశంలేదు. ఇక కెమెరా విభగానికి వస్తే, ఇది వెనుకభాగంలో 48MP సోనీ IMX586 సెన్సార్ కి జతగా మరొక 5MP కెమేరాని కలిపి డ్యూయల్ కెమేరా సెటప్పును అందించింది.  అలాగే, ముందుభాగంలో ఒక గొప్ప 32MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. సెక్యురిటి పరంగా, ఇది ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :