Oppo Reno 15C Sale: ఒప్పో 15 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్ రివీల్ చేసింది.!

HIGHLIGHTS

Oppo Reno 15 నుంచి మొత్తం నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

ఒప్పో రెనో 15c స్మార్ట్ ఫోన్ ను రెనో 15 సిరీస్ బడ్జెట్ ఫోన్ గా అందించింది

ఒప్పో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్ మరియు ఆఫర్లు కూడా విడుదల చేసింది

Oppo Reno 15C Sale: గత నెల ఒప్పో తన రెనో 15 సిరీస్ నుంచి మొత్తం నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. వాటిలో, అతి తక్కువ ధరలో అందించిన ఒప్పో రెనో 15c స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్ మరియు ఆఫర్లు కూడా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ పై ఒక లుక్కేద్దామా.

Oppo Reno 15C Sale

ఒప్పో రెనో 15c స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుందని ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఒప్పో అఫీషియల్ వెబ్సైట్, అమెజాన్ ఇండియా మరియు అన్ని రిటైల్ స్టోర్ నుంచి లభిస్తుంది.

ప్రైస్ అండ్ ఆఫర్స్

ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను మొత్తం రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో స్టార్టింగ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 34,999 ధరతో, హై ఎండ్ (12GB + 512GB) వేరియంట్ ను రూ. 37,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై Axis, SBI, HDFC, BOB, Federal బ్యాంక్ కార్డ్ 10% ఫ్లాట్ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా అందించింది.

Oppo Reno 15C : ఫీచర్స్

ఒప్పో రెనో 15C స్మార్ట్ ఫోన్ లో 6.57 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ రక్షణ, FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ తో వస్తుంది. ఇది శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే, ఇది 4nm టెక్నాలజీ ప్రాసెస్ ద్వారా వేగవంతమైన CPU అండ్ GPU తో ఈ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఉంటాయి.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 50MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ ఒప్పో కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ పై రూ. 30,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ఈ ఫోన్ లో గొప్ప బ్యాటరీ సెటప్ ను కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇది IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆధారితమైన లేటెస్ట్ ColorOS 16 తో ఫోన్ ఇంటర్‌ఫేస్ చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :