Oppo Reno 15 Series India launch confirmed today
Oppo Reno 15 Series ఇండియా లాంచ్ కోసం చాలా రోజులుగా టీజింగ్ చేస్తూ వస్తున్న ఒప్పో ఎట్టకేలకు ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. కేవలం ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కలిగిన కీలకమైన ఫీచర్లు కూడా కంపెనీ ఈరోజు విడుదల చేసింది. మరి ఒప్పో ప్రకటించిన ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ అండ్ కీలకమైన ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
ఒప్పో రెనో 15 సిరీస్ ను ఈ నెల 8న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే, 2026 జనవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ సిరీస్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ సిరీస్ ఫోన్లు కలిగిన కీలక ఫీచర్లు కూడా లాంచ్ డేట్ తో పాటు అనౌన్స్ చేసింది.
ఒప్పో రెనో 15 సిరీస్ వెనుక సింగిల్ గ్లాస్ తో చెక్కబడిన గొప్ప సింగిల్ గ్లాస్ బ్యాక్ తో ఈ ఫోన్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ హోలో ఫ్యూజన్ టెక్నాలజి కలిగిన ఇండియా యొక్క మొదటి ఫోన్ గా మార్కెట్ లో అడుగు పెడుతోంది. ఈ సిరీస్ ను కాంపాక్ట్ సైజులో కూడా అందిస్తున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ సిరీస్ ఫోన్లు మీడియాటెక్ Dimensity 8450 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సిరీస్ ఫోన్లు కలర్ OS 16 జతగా ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తాయి. అంతేకాదు, ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సిరీస్ ఫోన్లు కలిగిన కంప్లీట్ కెమెరా సెటప్ ను కంపెనీ ఈరోజు రివీల్ చేసింది. ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ సిరీస్ లో వెనుక 200MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ జూమ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఈ కెమెరా సపోర్ట్ తో 60FPS వద్ద గొప్ప స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ అందిస్తుందని ఒప్పో తెలిపింది. అంతేకాదు టన్నుల కొద్దీ AI కెమెరా ఫీచర్స్ మరియు చాలా ఒప్పో కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: AI సపోర్ట్ తో January 2026 Calendar మీకు నచ్చినట్లు మీరే సొంతంగా తయారు చేసుకోండి.!
ఈ సిరీస్ ఫోన్స్ బ్యాటరీ అండ్ ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 6200 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI నెట్ వర్క్ బూస్టర్ మరియు AI సూపర్ WiFi బూస్టర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఇండియాలో అడుగుపెడుతుందని ఒప్పో ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.