Oppo Reno 3 Pro యొక్క వారసుడిగా Oppo Reno 4 Pro భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్, వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ఇంకా మరెన్నో భారీ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. Oppo Reno 4 Pro జూన్ నెలలో ఒప్పో ప్రకటించిన రెనో 4 సిరీస్‌లో భాగం అవుతుంది. అయితే, భారతీయ వేరియంట్ దాని చైనీస్ కౌంటర్ కంటే కొంచెం భిన్నమైన ఫీచర్స్ తో వస్తుంది.
ఉదాహరణకు : ఇండియన్ Reno 4 Pro స్నాప్ డ్రాగన్ 765 జి కాకుండా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720 జి చిప్ సెట్ యొక్క శక్తితో వస్తుంది. ఇది ఇటీవల ప్రారంభించిన వన్ ప్లస్ నార్డ్ లో మనం చూశాము. Oppo Reno 4 Pro యొక్క ఫీచర్లు, ధర మరియు లభ్యత గురించి క్లుప్తంగా చూద్దాం.
ఒప్పో రెనో 4 ప్రో 8 జీబీ ర్యామ్ తో బేస్ వేరియంట్ రూ .34,990 వద్ద ప్రారంభమవుతుంది.
రెనో 4 ప్రో ఆగస్టు 5 నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లలో అమ్మకానికి వస్తుంది.
ఒప్పో రెనో 4 ప్రో చాలా సన్నని మరియు తేలికైనదిగా వుంటుంది మరియు వెనుక భాగంలో యాంటీ-గ్లేర్ మాట్టే ఫినిషింగ్ తో వస్తుంది, ఇది మృదువైన-టచ్ అనుభూతిని ఇస్తుంది. ఇది 7.7 మిల్లీమీటర్ల మందం మరియు 161 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఒక 6.5-అంగుళాల Full HD + రిజల్యూషన్ AMOLED స్క్రీన్ 90Hz హై-రిఫ్రెష్-రేట్ మరియు సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న సింగల్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తుంది.
రెనో 4 ప్రో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 720 G ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన Color OS 7.2 పై నడుస్తుంది.
ఒప్పో రెనో 4 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 MP ఎఫ్ / 1.7 ఎపర్చరు, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మోనోక్రోమ్ కెమెరా మరియు 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. వెనుక కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతుతో 30 fps వద్ద 4 K రిజల్యూషన్లతో షూటింగ్ చేయగలవు. ముందు భాగంలో, పంచ్-హోల్ కటౌట్ లోపల ఉంచబడినది 32MP సెల్ఫీ కెమెరా వుంటుంది.
ఇది Super VooC 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ద్వారా 65W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు కలిగిన 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఒప్పో వాదనల ప్రకారం 36 నిమిషాల్లో 0-100% వరకూ అత్యున్నత వేగంతో ఛార్జ్ చేయగల సత్తా ఈ ఫోనుకు వుంది.