Oppo Find N: తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటించిన ఒప్పో

HIGHLIGHTS

ఎట్టకేలకు ఒప్పో తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ని ప్రకటించింది

OPPO INNO DAY నుండి Oppo Find N పేరుతో మొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది

ఎట్టకేలకు ఒప్పో తన మొట్టమొదటి  ఫోల్డబుల్ ఫోన్ ని ప్రకటించింది. చైనాలో జరుగుతున్న OPPO INNO DAY కార్యకమం నుండి Oppo Find N పేరుతో ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇక ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ తో పోలిస్తే ఒప్పో ఫైండ్ ఎన్ చాలా కాంపాక్ట్ మరియు సరసమైనదిగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒప్పో యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ గురించి కంప్లీట్ గా తెల్సుకుందామా..!

Oppo Find N: ప్రైస్

Oppo Find N ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో CNY 7699 (సుమారు $1200) ధరలో వచ్చింది. అలాగే, 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 8699 (సుమారు $1400) ధరలో ప్రకటించబడింది.

Oppo Find N: స్పెక్స్

ఒప్పో ఫైండ్ ఎన్ పైన 5.49 అంగుళాల కవర్ డిస్ప్లేని 1972×988 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇక మైన్ డిస్ప్లే పెద్ద 7.1-అంగు ళాల LTPO స్క్రీన్ (1792 x 1920)తో మడత పెట్టగలిగేలా ఉంటుంది. అంటే కవర్ డిస్ప్లే పరంగా చూస్తే ఈ ఫోన్ మడత పెట్టిన స్థితిలో ఈ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ కంటే పెద్దగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ఫోల్డబుల్ స్క్రీన్ 2 లక్షల సార్లు మడత పెట్టిన పాడుకాదు.

ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ Oppo Find N వేగవంతమైన Snapdragon 888 Soc జతగా 12GB LPDDR5 ర్యామ్ శక్తితో వస్తుంది. దీనికి తోడు 512GB UFS 3.1 కూడా జతచెయ్యబడింది.

ఇక కెమెరాలు మరియు యాతర ఫీచర్ల పరంగా, Oppo Find N ఫోన్ లో 50MP SonyIMX766 ప్రధాన సెన్సార్ మరియు దీనికి జతగా 16MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  13MP టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగిన 4500mAh బ్యాటరీని కూడా కలిగివుంది.         

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :