Oppo K13x 5G launching with damage proof armor body
Oppo K13x 5G : ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఒప్పో టీజింగ్ మొదలు పెట్టింది. ఒప్పో K13 సిరీస్ నుంచి రీసెంట్ గా కె13 5జి ఫోన్ రిలీజ్ చేసిన ఒప్పో ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చేపట్టిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా వెల్లడించడం కూడా మొదలు పెట్టింది.
ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె13x 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు మాత్రమే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది. ఫ్లిప్ కార్య అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ డిజైన్ మరియు ప్రత్యేకతలు వెల్లడిస్తోంది.
ఒప్పో కె13x 5జి స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి కంపెనీ వివరాలు వెల్లడించింది. అదేమిటంటే ఈ ఫోన్ ను డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని ఒప్పి స్వయంగా వెల్లడించింది. ఈ ఫోన్ ఇమేజ్ ను కూడా టీజర్ పేజీ ద్వారా రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్ మరియు మరిన్ని వివరాలు అంచనా వేయడానికి అవకాశం అందించింది.
ఒప్పో అందించిన ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో 50MP AI ప్రధాన కెమెరాకి జతగా మరో కెమెరా వుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇక ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రౌండ్ కార్నర్ కలిగి క్లీన్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: Samsung Dolby Soundbar పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
కంపెనీ ఈ ఫోన్ గురించి చేస్తున్న టీజింగ్ పేజీలో ఈ ఫోన్ ముందుతరం స్మార్ట్ ఫోన్ ఒప్పో K12x ఫోన్ ఫీచర్స్ గురించి చూపిస్తూ అప్ కమింగ్ ఫోన్ గురించి హింట్ ఇస్తోంది. ఈ టీజర్ ద్వారా అప్ కమింగ్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సఫారీ కలిగి ఉంటుందని హింట్ ఇస్తోంది. అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో వస్తుందో చూడాలి.
ఒప్పో కె13x 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా త్వరలోనే ఒప్పో వెల్లడించే అవకాశం ఉంది.