Oppo K13 5G launched with big battery and all round features
Oppo K13 5G: ఒప్పో ఈరోజు K సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, ఒప్పో కె13 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు ఆల్ రౌండ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ లో బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.
ఒప్పో కె13 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 17,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండవ 8GB + 256GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఐసి పర్పల్ మరియు ప్రిజం బ్లాక్ రెండు కలర్స్ లో అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 తగ్గింపు ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్స్ ద్వారా లేదా ఎక్స్ చేంజ్ ద్వారా కొనే వారికి ఈ రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
ఒప్పో కె13 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ E4 AMOLED స్క్రీన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD+ స్క్రీన్ రిజల్యూషన్, అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా పరంగా డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50MP మెయిన్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో, 16MP Sony IMX480 సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI ఎరేజర్ వంటి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4 5G: రేపు విడుదల కానున్న ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇంట పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80 W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇవి కాకుండా ఈ ఫోన్ లో మంచి సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి. ఓవరాల్ గా ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఆల్ రౌండ్ ఫీచర్స్ తో అందించినట్లు ఒప్పో తెలిపింది.