రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. అదే, OPPO K10 5G మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను వేగవంతమైన 5G ప్రాసెసర్ Dimensity 810 తో తీసుకువస్తోంది. ఇప్పటికే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ అందించింది మరియు టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన వివరాలను కూడా ఒప్పో టీజింగ్ ద్వారా వెల్లడించింది. మరి రేపు విడుదల కానున్న ఒప్పో కొత్త ఎటువంటి ప్రత్యేకతలతో రాబోతోందో తెల్సుకుందామా.
రేపు విడుదల కానున్న ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చాలా నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తోంది. అంటే, ఎటువంటి హడావిడీ లేకుండా చక్కగా అందించింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 తో తీసుకువస్తునట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ 8GB ర్యామ్ కి జతగా 5GB ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నట్లు ఒప్పో టీజర్ ద్వారా తెలిపింది.
ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను డ్యూయల్ LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఈ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W SuperVOOC సపోర్ట్ కలిగిన బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో కొత్త తరహా స్పీకర్లను అందించినట్లు కూడా ఒప్పో చెబుతోంది.