200MP Hasselblad టెలిఫోటో కెమెరాతో లాంచ్ అవుతున్న Oppo Find X9 Series

Updated on 16-Oct-2025
HIGHLIGHTS

Oppo Find X9 Series స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఒప్పో కన్ఫర్మ్ చేసింది

200MP Hasselblad టెలిఫోటో కెమెరాతో లాంచ్ చేయబోతున్నట్లు కూడా ఒప్పో కన్ఫర్మ్ చేసింది

భారీ ఫీచర్స్ మరియు కళ్ళు తిప్పలేని స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ కి సిద్ధం అయ్యింది

Oppo Find X9 Series స్మార్ట్ ఫోన్ లను 200MP Hasselblad టెలిఫోటో కెమెరాతో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరొందిన ఫైండ్ X సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా కొత్త ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ సిరీస్ భారీ ఫీచర్స్ మరియు కళ్ళు తిప్పలేని స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ కి సిద్ధం అయ్యింది.

Oppo Find X9 Series : లాంచ్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో స్పెయిన్ లోని బార్సిలోనా జరిగే ఈవెంట్ నుంచి లాంచ్ అవుతుంది. ఇండియా కాలమానం ప్రకారం అక్టోబర్ 28వ తేదీ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అయితే, ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ఒప్పో ఇంకా వివరాలు వెల్లడించలేదు.

Also Read: Flipkart Sale డిస్కౌంట్ తో 25 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart Tv

Oppo Find X9 Series : ఫీచర్స్

ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 200MP హాసెల్ బ్లాడ్ సూపర్ టెలిఫోటో కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా 120x సూపర్ జూమ్ కలిగి ఉంటుందని కూడా ఒప్పో తెలిపింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్ మీడియాటెక్ 3వ జనరేషన్ 3nm ప్రోసెసర్ Dimensity 9500 తో లాంచ్ అవుతోంది. ఒప్పో తన X అకౌంట్ నుంచి ఈ ఫీచర్స్ గురించి టీజర్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గొప్ప ఫోటో గ్రఫీ కోసం యాక్టివ్ ఆప్టికల్ అలైన్ మెంట్ (AOA) ఫీచర్ అందించినట్లు చెబుతోంది.

ఈ ఫోన్ టీజర్ ఇమేజెస్ మరియు వీడియో ద్వారా ఈ ఫోన్ సరికొత్త స్టన్నింగ్ డిజైన్ కలిగి ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇందులో క్వాడ్ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 120FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 1.15mm యూనిఫార్మ్ అల్ట్రా థిన్ బెజెల్స్ కలిగిన అల్ట్రా క్లియర్ డిస్ప్లే ఉంటుందని కూడా ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :