OPPO Find X9 Pro: భారీ ఫీచర్స్ తో విడుదలైన ఒప్పో ప్రీమియం ఫోన్.!

Updated on 28-Oct-2025
HIGHLIGHTS

OPPO Find X9 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ని భారీ ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్లో ఒప్పో అట్టహాసంగా విడుదల చేసింది

స్టన్నింగ్ డిజైన్ మొదలుకొని జబర్దస్త్ కెమెరా వరకు ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంటుంది

OPPO Find X9 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ని భారీ ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్లో ఒప్పో అట్టహాసంగా విడుదల చేసింది. చూడగానే ఆకట్టుకునే స్టన్నింగ్ డిజైన్ మొదలుకొని జబర్దస్త్ కెమెరా వరకు ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మరి ఒప్పో గ్లోబల్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ వివరాలు ఏమిటో వివరంగా చూద్దామా.

OPPO Find X9 Pro : ఫీచర్స్

ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ లో వచ్చింది మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ తో ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా సౌండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. మీడియాటెక్ సరికొత్తగా విడుదల చేసిన Dimensity 9500 చిప్ సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. దీనికి జతగా 16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.1 512GB ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

కెమెరా పరంగా ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, HASSELBLAD 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50MP వైడ్ యాంగిల్ మరియు 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 120 FPS వద్ద 4K డాల్బీ విజన్ వీడియో మరియు ఇదే FPS వద్ద స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు 3x ఆప్టికల్ జూమ్ మరియు 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, మరింత జూమ్ కోరుకునే వారికీ 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన టెలీ కన్వర్టర్ డివైజ్ ని జత చేసుకునే అవకాశం కూడా ఈ ఫోన్ తో అందించింది.

Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.!

ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ 7500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఛార్జ్ టెక్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో 80W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ తో పాటు 50W AIRVOOC ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెట్ వర్క్ బూస్ట్ కోసం ప్రత్యేకమైన Chip S1 కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :