6500mAh Battery phone OPPO F29 5G price under rs 25000 sale start on Flipkart
ఒప్పో ఈరోజు F29 సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి OPPO F29 మరియు F29 Pro 5G రెండు ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ లను IP69 రేటింగ్ వాటర్ ప్రూఫ్, స్ట్రాంగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ చేసినట్లు ఒప్పో పేర్కొంది. ఒప్పో F29 సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో జస్ట్ లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
ఒప్పో ఎఫ్ 9 5జి ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 25,999 ధరతో ప్రకటించింది.
ఈ ఫోన్ పియా మంచి లాంచ్ ఆఫర్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను Federal, ICICI, BOBCARD, IDFC First, Axis మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ Pre-Orders కూడా ఈరోజు నుంచి మొదలు పెట్టింది.
ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2.2GHz ఆక్టా కోర్ చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఒప్పో ఫోన్ 50MP ప్రధాన కెమెరా మరియు 2MP మోనోక్రోమ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 4K వీడియో సపోర్ట్ మరియు అండర్ వాటర్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: IPL 2025 Match లను పెద్ద స్క్రీన్ లో అందించే బెస్ట్ బడ్జెట్ Smart Projector డీల్స్.!
ఈ ఫోన్ లో 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుంది.