రేపు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానున్న ఒప్పో వాటర్ ప్రూఫ్ ఫోన్ Oppo F27 Pro+ 5G

HIGHLIGHTS

Oppo F27 Pro+ 5G రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ IP69 తో వస్తుంది

డామేజ్ ప్రూఫ్ 360° ఆర్మర్ బాడీ వంటి గొప్ప ఫీచర్ కూడా ఈ ఫోన్ లో వుంది

ఒప్పో ప్రకటించిన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Oppo F27 Pro+ 5G రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను వాటర్ ప్రూఫ్ రేటింగ్ IP69 మరియు డామేజ్ ప్రూఫ్ 360° ఆర్మర్ బాడీ వంటి గొప్ప ఫీచర్ లతో ఒప్పో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో గొప్ప డిజైన్ మరియు ఇతర ఫీచర్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలియచేసింది. రేపు విడుదల అవ్వబోతున్న ఈ ఒప్పో కొత్త ఫోన్ ఎలాంటి ఫీచర్లతో రానున్నదో ఒక లుక్కేద్దామా.

Oppo F27 Pro+ 5G : ఫీచర్స్

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను చాలా కఠినమైన డిజైన్ తో ఒప్పో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ను ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా IP69 రేటెడ్ వాటర్ ప్రూఫ్ ఫీచర్ మరియు డామేజ్ ప్రూఫ్ 360° ఆర్మర్ బాడీని ఇందులో అందించింది. ఇండియాలో ఈ ఫోన్ IP69 వాటర్ ప్రూఫ్ రేటింగ్ కలిగిన మొదటి ఫోనుగా తీసుకు వస్తున్నట్లు కూడా ఒప్పో సగర్వంగా చెబుతోంది.

Oppo F27 Pro+ 5G

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 5జి ఫోన్ లో అల్ట్రా టఫ్ 3D Curved AMOLED డిస్ప్లే ఉన్నట్లు కూడా ఒప్పో కన్ఫర్మ్ చేసింది. దీనికి రక్షణగా అత్యంత కఠినమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే అందమైన డిజైన్ తో ఉన్నట్లు ఈ ఫోన్ ఇమేజ్ లను చూస్తుంటేనే అర్ధం అవుతోంది. ఇందులో వెనుక లగ్జరీ లుక్ మరియు ఫీల్ ఇచ్చే కాస్మోస్ రింగ్ మరియు ప్రీమియం స్టెయిన్ రెసిస్టెంట్ లెథర్ కూడా ఉన్నాయి.

Also Read: భారీ డిస్కౌంట్ తో 10 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ Dolby 5.1 సౌండ్ బార్.!

ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ ను గురించి కంపెనీ ఎటువంటి వివరాలు వెల్లడించ లేదు. అయితే,ఈ ఫోన్ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో వెనుక LED ఫ్లాష్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ సెటప్ లో 64MP ఇన్నోవేటివ్ కెమెరా సిస్టం ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోన్ మిడ్ నైట్ నేవి మరియు డస్ట్ పింక్ రెండు కలర్ లలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :