OPPO F15 మిడ్ రేంజ్ ధరలో మంచి డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చింది

Updated on 17-Jan-2020
HIGHLIGHTS

ఈ ఒప్పో F 15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది

OPPO సంస్థ, ఇండియాలో  తన F 15 స్మార్ట్‌ ఫోన్ను విడుదల చేసింది. ఇది లైటనింగ్ బ్లాక్ మరియు యునికార్న్ వైట్ కలర్‌ రెండు వంటి విభిన్న కలర్స్ లో  లభిస్తుంది. ఈ పరికరం యొక్క ముఖ్య ఫీచర్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే, OPPO F15 ఒక 6.3-అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది మరియు 2400×1080 పిక్సెల్స్ యొక్క FHD + రిజల్యూషన్ను అందిస్తుంది. అధనంగా, ఈ డిస్ప్లేకి  గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కూడా ఇవ్వబడింది.

కెమేరా పరంగా, ఈ ఫోనులో 48MP (F1.7) ప్రధాన కెమెరా, 8MP (F2.25) అల్ట్రా-వైడ్ యాంగిల్, 2M (F2.4) మాక్రో లెన్స్ మరియు 2M ( F2.4) పోర్ట్రెయిట్ లెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది, ఇది F/ 2.0 ఎపర్చరుతో ఉంది.

ఈ ఒప్పో F 15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది మరియు ఒక డేడికేటెడ్ మెమెరీ కార్డుతో 512 జీబీ వరకూ పెంచవచ్చు. ఒప్పో యొక్క ఈ కొత్త ఎఫ్ 15 ఫోనులో 3 కార్డ్ స్లాట్లు ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం WLAN 802.11a / b / g / n / ac, WLAN 2.4G, WLAN 5.1G, WLAN 5.8G, WLAN డిస్ప్లే, బ్లూటూత్ 4.2 లకు మద్దతు ఇవ్వబడుతోంది.

ఒప్పో ఎఫ్ 15 ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా ColorOS 6.1.2 పైన పనిచేస్తుంది మరియు Mali G72  జిపియుతో జత చేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 70 (ఎమ్‌టి 6771 వి) SoC ని కలిగి ఉంది. Oppo F15 4,000mAh బ్యాటరీని ఒక  VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క సాంకేతిక మద్దత్తుతో ఇస్తుంది. ఈ ఫోన్  160.2×73.3×7.9mm కొలతలతో మరియు 172 గ్రాముల బరువుతో ఉంటుంది.

ఒప్పో ఎఫ్ 15 : ధర

ఒప్పో ఎఫ్ 15 యొక్క 8 జిబి ర్యామ్ వేరియంట్‌ ను రూ .19,990 కు కొనుగోలు చేయవచ్చు మరియు ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ఈ రోజు నుండి ప్రీ-ఆర్డర్ చేయబోతోంది, అయితే ఈ పరికరం యొక్క మొదటి సేల్ జనవరి 24 నుండి ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఒప్పో ఎఫ్ 15 తో వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు HDFC  కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :