/var/www/html/wp-shared-data/advanced-cache.php OPPO A6 5G: బేసిక్ 5జి ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

OPPO A6 5G: బేసిక్ 5జి ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 21-Jan-2026
HIGHLIGHTS

OPPO A6 5G స్మార్ట్ ఫోన్ ను 7000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను మంచి వాటర్ ప్రూఫ్ రేటెడ్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది

ఒప్పో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది

OPPO A6 5G: ఒప్పో ఎ6 సిరీస్ నుంచి ఇప్పటికే ప్రో వెర్షన్ విడుదల చేసిన ఒప్పో ఇప్పుడు ఈ ఫోన్ సిరీస్ బేసిక్ ఫోన్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 7000 mAh భారీ బ్యాటరీ మరియు మంచి వాటర్ ప్రూఫ్ రేటెడ్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ లెట్స్ బేసిల్ 5జి ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

OPPO A6 5G : ప్రైస్

ఒప్పో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

ఒప్పో ఎ6 5జి (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 17,999

ఒప్పో ఎ6 5జి (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 19,999

ఒప్పో ఎ6 5జి (6 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్: రూ. 21,999

ఈ ఫోన్ ను సఫైర్ బ్లూ మరియు ఐస్ వైట్ రెండు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఒప్పో అఫీషియల్ సైట్ మరియు ప్రధాన రిటైల్ స్టోర్స్ నుంచి సేల్ కి అందుబాటులో వచ్చింది.

ఆఫర్లు

ఒప్పో ఈ కొత్త ఫోన్ పై నో కాస్ట్ EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Motorola Signature: లాంచ్ కంటే ముందే లీకైన మోటో సూపర్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్.!

OPPO A6 5G : ఫీచర్స్

ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ LCD డిస్‌ప్లే కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HD+ (1570 × 720) రిజల్యూషన్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1125 nits పీక్ బ్రైట్నెస్ తో ఆరు బయట కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 5G తో అందించింది. ఇది రోజువారీ వినియోగం, వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, మరియు గేమింగ్ కోసం కూడా సరిపోతుంది. ఇందులో 6 జీబీ వరకు ర్యామ్ మరియయు 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించింది.

ఈ ఒప్పో ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా మరియు 2 MP మోనోక్రోమ్ సెన్సార్ ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 8 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 60fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ మరియు మంచి AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన 7,000 mAh బ్యాటరీ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఫోన్ లో 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఒప్పో అందించింది.

ఈ ఫోన్ ను IP66, IP68 మరియు IP69 మూడు రేటింగ్స్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్ గా అందించింది. ఆండ్రాయిడ్ 15 ఆధారమైన ColorOS 15 సాఫ్ట్ వేర్ తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :