OPPO A53 2020: కేవలం రూ.12,990 ధరలో ట్రిపుల్ కెమేరా 90Hz డిస్ప్లేతో వచ్చింది

OPPO A53 2020: కేవలం రూ.12,990 ధరలో ట్రిపుల్ కెమేరా 90Hz డిస్ప్లేతో వచ్చింది
HIGHLIGHTS

OPPO A53 2020 స్మార్ట్ ఫోన్, ఒప్పో నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ‌ఫోన్ ‌లలో ఒకటి .

ఈ ఒప్పో A 53 90Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని అందించింది.

ఈ OPPO A53 స్మార్ట్ ‌ఫోన్ ఒక 6.5 అంగుళాల HD + డిస్ప్లేని 20:9 యాస్పెక్ట్ రేషీయోతో కలిగి వుంటుంది.

OPPO A53 2020 స్మార్ట్ ఫోన్, ఒప్పో నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ‌ఫోన్ ‌లలో ఒకటి .ఈ స్మార్ట్ ‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో విడుదల చెయ్యబడింది. ఒప్పో యొక్క ఒప్పో A 53 2020 కూడా తక్కువ ధర గల స్మార్ట్ ‌ఫోన్, ఇది ఆన్ ‌లైన్ షాపింగ్ వెబ్ ‌సైట్ అమెజాన్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇతర ముఖ్యమైన లక్షణాలను ఒక పరిశీలిద్దాం.

OPPO A53 2020 Price

1. OPPO A53 : 4GB + 64GB వేరియంట్ ధర – Rs. 12,990 

2. OPPO A53 : 6GB + 128GB వేరియంట్ ధర – Rs. 15,490

OPPO A53 2020 ఆగస్టు 25 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.  స్ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది – ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్ మరియు ఫ్యాన్సీ బ్లూ

OPPO A53 2020: డిస్ప్లే

 ఈ OPPO A53 స్మార్ట్ ‌ఫోన్ ఒక 6.5 అంగుళాల HD + డిస్ప్లేని 20:9 యాస్పెక్ట్ రేషీయోతో  కలిగి వుంటుంది. అధనంగా, ఈ ఒప్పో A 53 90Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే మీకు పంచ్ హోల్ డిజైన్ తో అందించబడింది కాబట్టి మంచి స్టైల్ మరియు ఎక్కువ స్పెస్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లేతో అందుతుంది.

OPPO A53 2020: పెర్ఫార్మెన్స్

ఇక ఈ OPPO A53 2020 యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 460 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB + 128GB మరియు 4GB + 64GB వేరియంట్ ‌లను కూడా కలిగి ఉంది.అధనంగా, ఒక 3-కార్డ్ స్లాట్ ద్వారా 256GB కి విస్తరించవచ్చు, ఇది స్మార్ట్‌ ఫోన్ ‌లో భారీ డేటాను స్టోరేజ్ చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. OPPO A53 కలర్ OS 7.2 ఆధారితంగా ఆండ్రాయిడ్ 10 తో వస్తుంది

OPPO A53 2020: కెమేరా 

OPPO A53 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో,  13MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. వినియోగదారులు ఈ 2MP మ్యాక్రో కెమెరా ద్వారా 4 సెంటీమీటర్ల దగ్గరగా ఉన్న వివరాలను జూమ్ చేయవచ్చు మరియు స్నాప్ చేయవచ్చు. AI ట్రిపుల్ కెమెరా పోర్ట్రెయిట్ బోకె, డాజిల్ కలర్ మోడ్ మరియు డజను స్టైలిష్ ఫిల్టర్‌ లతో సహా స్టైలిష్ కెమెరా ఫీచర్లతో పరిపూర్ణంగా వుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీ ల కోసం 16MP సెల్ఫీ కెమేరాని అందించారు.

OPPO A53 2020: బ్యాటరీ & సెక్యూరిటీ

ఇక సెక్యూరిటీ మరియు బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక పెద్ద 5000 ఎమ్ఏహెచ్ అధిక బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, ప్యానెల్ వెనుక భాగంలో ఒక వేగవంతమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo