Oppo భారతదేశంలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఈ విభాగంలో ప్రస్తుతం ఆధిపత్యం చెలాయించే Redmi Note 9 Pro Max మరియు Realme 6 Pro వంటి ఫోన్‌ల పైన దృష్టి సారించిన Oppo సంస్థ తన OPPO A52 ని తీసుకొచ్చింది. ఈ OPPO A52 క్వాడ్-కెమెరా సెటప్‌తో పాటు అధిక సామర్థ్యం గల బ్యాటరీతో మరియు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ వారం ప్రారంభంలో, హీలియో P 35 చిప్‌తో నడిచే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Oppo A12 ను కంపెనీ ప్రకటించింది మరియు దీని ధర రూ .9,990 నుండి ప్రారంభమవుతుంది. ఇక ఈ A52 తో, ఒప్పో మరిన్ని ఎంపికలతో ఈసారి మధ్య-శ్రేణి విభాగంలోతన లైనప్‌ను విస్తరిస్తోంది.
ఒప్పో A52 ఒక 6.5-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగి ఉంది. ఎగువ మూలలో పంచ్-హోల్ కటౌట్‌తో ఇది స్క్రీన్‌కు 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. మూడు వైపులా తక్కువ అంచులు కలిగి ఉంటుంది. ఈ ఫోన్, 8.9 మిమీ తక్కువ మందంతో చాలా సన్నగా ఉంటుంది మరియు 192 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO A52 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌తో ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి స్టోరేజ్ ను మరింత విస్తరించే ఎంపికతో ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారితంగా లేటెస్ట్ ColorOS 7.1 పైన నడుస్తుంది.
Oppo A52 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో f / 1.7 ఎపర్చరు గల ప్రాధమిక 12MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీల ఫీల్డ్-వ్యూ, 2MP మాక్రో కెమెరా మరియు ఒక 2MP డెప్త్ సెన్సార్ కలిగివుంటుంది. వెనుక కెమెరాలు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతుతో 30fps వరకు 4K లో రికార్డ్ చేయగలవు. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నోచ్ కటౌట్ లోపల ఉంది.
ఒప్పో A52 ప్రాథమిక కనెక్టివిటీ లక్షణాలైన Wi-fi మరియు బ్లూటూత్ 5.0 తో పాటు ఛార్జింగ్ కోసం USB టైప్-సి మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది మరియు బాక్సులో సపోర్టెడ్ ఛార్జర్ తో పాటుగా అందించబడుతుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఒప్పో ఏ 52 వేరియంట్ ధర రూ .16,990. ఈ ఫోన్ జూన్ 17 నుండి ప్రధాన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లలో రెండు రంగుల ఎంపికలతో అమ్మబడుతుంది – నలుపు మరియు తెలుపు.
A52 యొక్క మరో రెండు వేరియంట్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది, ఒకటి 4GB RAM మరియు 128GB స్టోరేజితో మరియు మరొకటి 8GB RAM మరియు 128GB స్టోరేజితో రానున్న రోజుల్లో ప్రకటించనుంది.