OPPO A 12 రూ.9,999 ధరతో బడ్జెట్ ఫోనుగా విడుదలయ్యింది

OPPO A 12 రూ.9,999 ధరతో బడ్జెట్ ఫోనుగా విడుదలయ్యింది
HIGHLIGHTS

ఈ OPPO A 12 లో డ్యూయల్ కెమెరా సెటప్, హై కెపాసిటీ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

భారతదేశంలో రెడ్‌మి 8, Relame 5 i మరియు Narzo 10 A లతో పోటీ పడేలా ఒప్పో సంస్థ నుండి వచ్చిన కొత్త బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్ ఇది.

OPPO A 12 జూన్ 8 న భారతదేశంలో విడుదల చేయబడింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 2020 లో మొదటిగా చూపించారు. భారతదేశంలో రెడ్‌మి 8, Relame 5 i  మరియు Narzo 10 A లతో పోటీ పడేలా ఒప్పో సంస్థ నుండి వచ్చిన కొత్త బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్ ఇది. ఈ ఒప్పో ఎ 12 లో డ్యూయల్ కెమెరా సెటప్, హై కెపాసిటీ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఒప్పో A12 యొక్క స్పెక్స్, ధర మరియు లభ్యత గురించి తెలుసుకుందాం …

OPPO A12 ధర 

OPPO A12 యొక్క 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,990 రూపాయలు కాగా, 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 11,490 రూపాయలుగా ప్రకటించింది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ వంటి రెండు రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,  జూన్ 10 వ తేదీ నుండి అన్ని ప్రధాన Online ప్లాట్ఫారం, ప్రధాన షాపులు మరియు అవుట్ లెట్స్ నుండి కొనుగోలు చేయవచ్చు.

OPPO A12 ప్రత్యేకతలు

ఒప్పో A12 లో ఒక 6.22 అంగుళాల HD + డిస్ప్లే ఉంది మరియు ఇది 1520 x 720 పిక్సెల్స్ రిజల్యూషనుతో వస్తుంది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్  ఇచ్చినట్లు కూడా చెబుతోంది. సెల్ఫీ కెమెరాని డిస్ప్లే యొక్క వాటర్‌డ్రాప్ నాచ్ లో అందించింది మరియు ఇది 19: 9 యాస్పెక్ట్ రేషియోని అందిస్తుంది. ఇది ఎంట్రీ లెవల్ ఫోన్ కావడంతో, A12 కు 8.3 మిమీ మందపాటి మరియు 165 గ్రాముల బరువున్న ప్లాస్టిక్ బాడీ ఇవ్వబడింది.

ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU  మరియు PowerVR GE8320  గ్రాఫిక్స్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇచ్చారు. అధనంగా, మైక్రో SD కార్డుతో స్టోరేజిను కూడా పెంచవచ్చు. ఆండ్రాయిడ్ 9 ఆధారంగా Color OS  6.1 తో ఫోన్ పనిచేస్తుంది.

ఒప్పో ఎ 12 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎపర్చరు ఎఫ్ / 2.2 మరియు రెండవ కెమెరా 2 MP  డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఇవ్వబడింది, దీనిలో 5 ఎంపి సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో వై-ఫై, బ్లూటూత్ 5.0 మరియు మైక్రో యుఎస్‌బి ఎంపికలు ఉన్నాయి మరియు ఈ ఫోన్‌లో 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo