OnePlus Shutting Down news spreading widely but know the truth
OnePlus Shutting Down: ప్రపంచ మార్కెట్లో తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ వన్ ప్లస్ త్వరలో బంద్ అవుతుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఈ విషయం గురించి వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన విడుదల చేయలేదు. అయితే, కొత్త పుకార్లకు ప్రధాన కారణం మాత్రం కంపెనీ యొక్క ఇండియా CEO Robin Liu కంపెనీ నుండి వైదొలగి చైనా కి రిటర్న్ అవుతున్నట్లు వచ్చిన న్యూస్. 2026 ప్రారంభ నుంచి జరుగుతున్న వన్ ప్లస్ మూసివేత గురించి అసలు వైనం ఏమిటో చూద్దాం.
వన్ ప్లస్ ఇండియా CEO Robin Liu కంపెనీ వైదొలగినట్లు వచ్చిన వార్త తర్వాత వన్ ప్లస్ కంపెనీ బంద్ అవుతుంది అని కొత్త న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే, 2026 ప్రారంభం జనవరి నెలలో వన్ ప్లస్ షట్ డౌన్ అవ్వబోతుంది అనే విషయాన్ని ముందుగా ఖండించింది ఇదే రాబిన్ లియూ. ఇప్పుడు అదే రాబిన్ లియూ ఇండియా సీఈఓ స్థానం నుండి వైదొలగి తిరిగి చైనా వెళ్లబోతున్నారు అన్న న్యూస్ రావడంతో పాత వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.
కొత్తగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, రాబిన్ లియూ ఇండియా సీఈఓ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ షట్ డౌన్ చేస్తున్నట్లు ఎటువంటి అఫీషియల్ న్యూస్ మాత్రం ప్రకటించలేదు.
Also Read: Redmi 15A : బిగ్ స్క్రీన్ తో షియోమీ బడ్జెట్ ఫోన్ లాంచ్ కోసం సిద్ధం.!
ప్రస్తుతం నెట్టింట్లో జరుగుతున్న ఈ చర్చలో నిజం లేదని ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ఏప్రిల్ నెలలో ఇండియాలో వన్ ప్లస్ కంపెనీ బంద్ అవుతుందిని ఇప్పుడు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి, వన్ ప్లస్ ఇప్పటికే ఏప్రిల్ నెలలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది. అంటే, ప్రస్తుతం వస్తున్న కథనాలలో నిజం లేదని మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే, వన్ ప్లస్ మదర్ కంపెనీ అయిన ఒప్పో లో కలిసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒప్పో ఇప్పటికే రియల్ మీ కంపెనీని తనలో కలుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులు మరియు మార్కెట్లో పెరిగిన కాంపిటీషన్ ప్రభావంతో ఖర్చులు తగ్గించే దిశగా ఈ చర్యలు తీసుకుంది. అదే మార్గంలో వన్ ప్లస్ విషయంలో కూడా అదే ఫార్ములా ఉపయోగించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
అయితే, ఇవన్నీ కూడా మార్కెట్ వర్గాలు వేస్తున్న అంచనాలుగా మాత్రమే చూడాలి. కంపెనీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేవరకు మనం ఎటువంటి విషయాన్ని రూఢీగా చెప్పలేము.