వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ పేలినట్లుగా నివేదికలు వచ్చిన తరువాత, OnePlus Nord CE స్మార్ట్ ఫోన్ తన కళ్ళముందరే పేలినట్లు ఒక నార్డ్ CE స్మార్ట్ ఫోన్ యూజర్ Linkedin మరియు ట్విట్టర్ లో పేలిన ఫోన్ ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ సంఘటన జనవరి 2 న జరిగింది మరియు ఈ పేలుడులో ఎవరూ గాయ పడకపోవడం విశేషం. అయితే, OnePlus యొక్క ఉత్పత్తుల పైన వన్ ప్లస్ చేస్తున్న చెకింగ్ పైన ఈ ఘటనలు ప్రశ్నలు రేకెత్తేలా చేస్తున్నాయి.
OnePlus Nord CE పేలినట్లుగా పేర్కొన్న యూజర్ పేరు దుష్యంత్ గోస్వామి. ఈ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రకారం, 6 నెలల క్రితం కొనుగోలుచేసి తన వన్ ప్లస్ నార్డ్ CE స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా పేలినట్లుగా తెలిపారు. తన జేబులో ఉన్న ఫోన్ బాగా వేడెక్కడంతో జేబులోంచి బయటకు తీశాడు. ఫోన్ తీసిన కొద్దీ సేపటి తరువాత ఈ ఫోన్ హఠాత్తుగా పేలింది.
ఈ ఫోన్ కొన్నప్పటి నుండి బాగానే పనిచేసిందని, 2022 జనవరి 2న ఫోన్ వేడెక్కడంతో జేబులోంచి బయటకు తీశానని, తీసిన 2 నుండి 5 సెకన్ల లోపలే ఈ ఫోన్ పేలిపోయిందని, సదరు వినియోగదారుడు తెలిపాడు. అంతేకాదు, అదృష్టవశాత్తు తనకు ఏమి జరగ లేదని కూడా తెలిపాడు. దుష్యంత్ ఈ విషయాన్ని తన Linkedin లో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు.
https://twitter.com/DushyantGiriGo7/status/1478301753913516035?ref_src=twsrc%5Etfw
ఈ విషయాన్ని వన్‌ప్లస్‌కు కూడా తెలియజేసినట్లు కూడా ఈ వ్యక్తి చెప్పారు. దుశ్యంత్ తన పోస్ట్ లో OnePlus CEO నవనీత్ నక్రా మరియు కంపెనీ వ్యవస్థాపకుడు పీట్ లాను కూడా ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన OnePlus ఇండియా సపోర్ట్ దుష్యంత్ ను తమను సంప్రదించమని కోరుతూ ట్వీట్ చేసింది.
ఈ క్లెయిమ్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి, అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మరియు నార్డ్ CE ఫోన్ ఎలా పేలిపోయిందో తెల్సుసుకోవడానికి మేము దుశ్యంత్ మరియు OnePlus ఇరువురిని సంప్రదించాము. దీని గురించి మరింత సమాచారం తెలిసిన వెంటనే మీకు తెలియచేస్తాము.