OnePlus Nord CE 6 launched in India and know the price and features
OnePlus Nord CE 6: వన్ ప్లస్ ఈరోజు నార్డ్ CE 6 సిరీస్ ఫోన్లు విడుదల చేసింది. వీటిలో నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ కొత్త ఫోన్ ను 144 FPS గేమింగ్ సపోర్ట్ కలిగిన ప్రోసెసర్, డిస్ప్లే మరియు ప్రత్యేకమైన డిస్ప్లే చిప్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు మంచి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: SASA LELE Deal: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ను బెస్ట్ ప్రైస్ లో అందుకోండి.!
వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అందించింది. ఇది గేమింగ్ మరియు వీడియోలకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 16 జతగా ఆండ్రాయిడ్ OS 16 పై నడుస్తుంది.
ఈ వన్ ప్లస్ కొత్త ఫోన్ 50MP (OIS సపోర్ట్) మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వన్ ప్లస్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో ఉంటుంది.